సావిత్రి బయోపిక్ సూపర్ హిట్, ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్.. మరి ఏఎన్నార్ బయోపిక్, నాగార్జున కామెంట్స్

First Published | Nov 23, 2024, 4:01 PM IST

వెండితెరపై బయోపిక్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ బయోపిక్ చిత్రాలు తెరకెక్కించి మెప్పించడం అంత సులువు కాదు. మహానటి, ఎంఎస్ ధోని లాంటి చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. 

వెండితెరపై బయోపిక్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ బయోపిక్ చిత్రాలు తెరకెక్కించి మెప్పించడం అంత సులువు కాదు. మహానటి, ఎంఎస్ ధోని లాంటి చిత్రాలు మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్ చిత్రాలకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. 

నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని గ్రాండ్ గా రూపొందించారు. కానీ ఆ మూవీ ఆడియన్స్ ని ఏమాత్రం మెప్పించలేకపోయింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మూవీ మహానటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. 


ఈ క్రమంలో ఏఎన్నార్ బయోపిక్ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఏఎన్నార్ బయోపిక్ పై తాజాగా నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున రీసెంట్ గా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జునకి ఏఎన్నార్ బయోపిక్ చిత్రం గురించి ప్రశ్న ఎదురైంది. 

దీనికి నాగార్జున బదులిస్తూ.. ఎవరి బయోపిక్ చిత్రం అయినా తెరకెక్కించాలి అంటే వాళ్ళ జీవితంలో అద్భుతమైన విజయాలు.. అదే స్థాయిలో దారుణమైన కష్టాలు వివాదాలు కూడా ఉండాలి. ఏఎన్నార్ జీవితంలో విజయాలు తప్ప కష్టాలు, వివాదాలు లేవు అని నాగార్జున తెలిపారు. కాబట్టి బయోపిక్ తెరకెక్కించాల్సిన అవసరం లేదు అని అన్నారు. కానీ డాక్యుమెంటరీ చిత్రం రూపొందించే ఆలోచన మాత్రం ఉందని తెలిపారు. 

Latest Videos

click me!