అక్కినేని ఫ్యామిలీలో ఆస్తి గొడవలు..నాగార్జున సోదరుడు ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఇదేనా ?

First Published | Mar 15, 2024, 5:17 PM IST

లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ ప్రస్తుతం టాలీవుడ్ లో అంత యాక్టివ్ గా లేరు. గతంలో ఆయన కొన్ని చిత్రాలని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు.

లెజెండ్రీ అక్కినేని నాగేశ్వర రావు పెద్ద కుమారుడు అక్కినేని వెంకట్ ప్రస్తుతం టాలీవుడ్ లో అంత యాక్టివ్ గా లేరు. గతంలో ఆయన కొన్ని చిత్రాలని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. వాటిలో రక్షణ, శివ, ఇద్దరూ ఇద్దరే , తీర్పు లాంటి చిత్రాలు ఉన్నాయి. 

 ఇటీవల ఇంటర్వ్యూలో అక్కినేని వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాన్నగారికి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించారు. సినిమాలు నిర్మించాలంటే అప్పుడు చెన్నైకి కానీ, బెంగుళూరు కానీ వెళ్లాల్సి వచ్చేది. దీనితో అప్పటి ప్రభుత్వ సహకారంతో నాన్న అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. మొత్తం బండరాళ్లు గుట్టలు ఉన్నాయి. 


ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఉన్న ప్రాంతంలో అప్పుడు ఒకే ఒక్క కోళ్ల ఫారం ఉండేది. దాదాపు 2000 లారీల మట్టి తీసుకొచ్చి పోశారు. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియో ఏడాదికి 20 లక్షల వరకు నష్టాల్లో నడిచేది. సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తే కానీ నష్టాల నుంచి బయట పడలేం అని నిర్ణయించుకున్నా అని అక్కినేని వెంకట్ అన్నారు. 

అంతకు ముందు కూడా మేము సినిమాలు నిర్మించాం.. కానీ నాన్నగారు మాకు సంబంధం లేకున్నా మా పేర్లు పెట్టి సినిమా చేసేవారు అని తెలిపారు. మీరు ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైనట్లు ఉన్నారు. ఆస్తి గొడవలు రావడం, నాగార్జునతో పడకపోవడం లాంటి కారణాలు చెబుతూ రూమర్స్ వస్తున్నాయి.. నిజమేనా అని ప్రశ్నించగా వెంకట్ స్పందించారు. 

మా ఫ్యామిలిలో ఎలాంటి విభేదాలు లేవు. ఎందుకంటే మేము డబ్బు మనుషులం కాదు.  ఇలాంటి రూమర్స్ కొన్నిసార్లు నా దగ్గరకి కూడా వచ్చాయి అని అన్నారు. కాని అలాంటి రూమర్స్ ని పట్టించుకోము అని తెలిపారు. 

Nagarjuna-Amala

ఫ్యామిలిలో ఎవరికీ ఎలాంటి కష్టం వచ్చినా నేను, నాగార్జున ముందుంటాం అని తెలిపారు. కాబట్టి ఇలాంటి రూమర్స్ కి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు అని వెంకట్ పేర్కొన్నారు. 

Latest Videos

click me!