ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `పుష్ప` చిత్రంతో తన ఇమేజ్‌ని పెంచుకున్నారు. మార్కెట్‌ని పెంచుకున్నారు. `పుష్ప2`తో ఆ మార్కెట్‌ని మరింతగా పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ మూవీ ఇండియన్ మార్కెట్‌నే కాదు, ఇతర దేశాల మార్కెట్‌ని కూడా టార్గెట్ చేసింది. రష్యా, జపాన్, అమెరికా, దుబాయ్, ఇలా ఇతర దేశాల్లోనూ సినిమాని భారీగా విడుదలకు రంగం సిద్ధమవుతుంది. `పుష్ప2`తో బన్నీ తన రేంజ్ ఏంటో చూపించేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. సినిమా ఫలితాన్ని బట్టి ఆయన మార్కెట్ ఏ స్థాయిలో పెరిగిందో ఓ అంచనా వస్తుంది.