మొదటి భార్యతో డివోర్స్ తర్వాత జరిగిన సంఘటన, నా జీవితంలో అదే అత్యంత బాధాకరం..ఫస్ట్ టైమ్ నాగార్జున

First Published Jul 6, 2024, 11:29 AM IST

నాగార్జున కూడా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నాగార్జునకి మొదటగా దగ్గుబాటి లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి నాగ చైతన్య జన్మించాడు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు.

కింగ్ నాగార్జున టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ మన్మథుడు. ఆరుపదుల వయసులో కూడా నాగార్జున ఫిట్ నెస్ లెవల్స్ అద్భుతం అనే చెప్పాలి. నాగార్జున టాలీవుడ్ హీరోల్లో అత్యంత ధనికుడు అని అంతా అంటుంటారు. సినిమాలతో పాటు నాగార్జునకి ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. అదే విధంగా నాగ్ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. 

అయితే నాగార్జున కూడా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నాగార్జునకి మొదటగా దగ్గుబాటి లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి నాగ చైతన్య జన్మించాడు. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. 1984లో వీరి వివాహం జరిగింది. లక్ష్మి నుంచి విడిపోయాక నాగార్జున అమలని 1991లో వివాహం చేసుకున్నాడు. 

Latest Videos


అయితే తన జీవితంలో జరిగిన అత్యంత బాధాకర సంఘటన గురించి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైమ్ ఓపెన్ అయ్యారు. నాకు డివోర్స్ అయిన తర్వాత నాగ చైతన్యని వాళ్ళ అమ్మతో పంపాల్సి వచ్చింది. నేను తీవ్రంగా బాధపడ్డ క్షణాలు అవే. 

కానీ ఆ టైంలో వాడు వాళ్ళ అమ్మ దగ్గర పెరగాలి కాబట్టి పంపక తప్పలేదు. అయితే అప్పుడప్పుడూ వస్తూ వెళుతూ ఉండేవాడు. అది కాస్త సంతోషాన్ని ఇచ్చే విషయం. స్కూలింగ్ అయిపోయాక కంప్లీట్ గా హైదరాబాద్ కి వచ్చాడు అని నాగార్జున అన్నారు. 

చిన్నతనంలో వాడు పూర్తి స్థాయిలో నా దగ్గర లేడు అనే బాధ ఇప్పటికీ ఉందని నాగార్జున అన్నారు. నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య కూడా చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని తెలిపాడు. అమ్మ దగ్గర ఉండడాన్ని తానెప్పుడూ సంతోషంగా ఫీల్ అవుతానని అన్నారు. 

దగ్గుబాటి సురేష్ బాబు, విక్టరీ వెంకటేష్ నాగ చైతన్యకి మేనమామలు. ప్రస్తుతం చైతన్య తండేల్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. నాగార్జున, నాగ చైతన్య కలసి మనం చిత్రంలో నటించారు. ఆ మూవీ క్లాసిక్ హిట్ గా నిలిచింది. 

click me!