ప్రభాస్ తన కెరీర్ లో వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, పౌర్ణమి లాంటి ప్రేమ కథా చిత్రాలే ఎక్కువగా చేశారు. పూరి జగన్నాధ్ కాస్త కామెడీ టైమింగ్ తో యాక్షన్ మూవీస్ చేసినప్పటికీ అవి వర్కౌట్ కాలేదు. రాజమౌళి తర్వాత ప్రభాస్ ని అంత మాస్ గా చూపించిన డైరెక్టర్ అంటే కొరటాల శివ అనే చెప్పాలి.