అనుష్క ని మొదట చూడాగనే నాగ్ ఏమన్నారో తెలిస్తే షాకే

First Published | Oct 9, 2024, 2:41 PM IST

 బెంగళూరులో యోగా టీచర్ గా పని చేస్తున్న అనుష్కను టాలీవుడ్ లోకి తీసుకొచ్చింది నాగార్జునే. 

Anushka, nagarjuna, puri jagannath


నాగార్జున కు టాలెంట్ ని ఎంకరేజ్ చేసే లక్షణం ఉంది. ఆయన సినిమాలతో  ఎంతో మంది హీరోయిన్స్ పరిచయం అయ్యారు. అలాగే ఎంతో మంది డైరక్టర్స్ పరిచయమై ఓ వెలుగు వెలిగారు. నాగార్జున లేకపోతే నేను లేకపోదును అని రామ్ గోపాల్ వర్మ వంటి స్టార్ డైరక్టర్ చాలా సార్లు చెప్పారు. అందుకే ఇండస్ట్రీలో నాగ్ అంటే చాలా మందికి ఇష్టం. అలాగే అనుష్క సైతం నాగార్జున చిత్రంతో పరిచయం అయ్యారు. అయితే ఆమెను చూడగానే నాగార్జున మొదట ఏమన్నారో ఓ సారి పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Anushka, nagarjuna, puri jagannath


ఇక అప్పడప్పుడూ సినిమాలు చేస్తున్నా ఇప్పటికి   తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్కకు ఫుల్ క్రేజ్ .  అయితే అనుష్క కెరీర్ స్టార్ అయిందే నాగార్జున నటించిన సూపర్ సినిమాతో. ఆ తరువాత వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో చేసారు. వీళ్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అవుతుంది.

 ఆ కెమెస్ట్రీ  ఓ టైమ్ లో నాగార్జున- అనుష్కల మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు తెర మీదకు వచ్చే దాగా సాగాయి.  నాగార్జున , అనుష్క పెళ్లి చేసుకుంటున్నారని కూడా అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఆవగింజంత కూడా నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలకు తెలుసు కాబట్టి వాళ్లు నవ్వుకున్నారు.


Anushka, nagarjuna, puri jagannath


నాగార్జున నటించిన సూపర్ మూవీ తోనే అనుష్క సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత వీరిద్దరూ డమరుకం, డాన్, రగడ, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే నాగార్జున నటించిన ఊపిరి, కింగ్ సినిమాల్లో అనుష్క అతిథి పాత్రలో మెరిసింది. స్వీటీ యాక్ట్ చేసిన సైజ్ జీరో లో నాగార్జున గెస్ట్ గా మెరిశారు. అయితే మీరిద్దరూ పలుమార్లు స్క్రీన్ షేర్ చేసుకుంది.  


 ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున రియాక్ట్ అయ్యారు. అనుష్కతో ఎఫైర్ రూమర్లు ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే అనుష్కను తన సినిమాల్లో రిపీట్ చేయడానికి కారణమేంటో కూడా నాగార్జున వివరించారు.

`స్వతహాగా నేను హైట్ గా ఉంటాను.. అందువల్ల స్క్రీన్ పై నా పక్కన పొట్టిగా ఉన్న అమ్మాయిల కంటే పొడుగ్గా ఉన్న‌ అమ్మాయిలే బాగా సెట్ అవుతారు. అందుకే దర్శక నిర్మాతలకు పొడుగ్గా ఉండే హీరోయిన్లను తీసుకొని రికమెండ్ చేస్తుంటాను. అందుకే టాల్‌గా ఉండే అనుష్కను రిపీట్ చేసేవారు` అని నాగార్జున పేర్కొన్నారు.
 


ఇక నాగార్జున మొదటి సారి అనుష్కని చూడగానే పూరి జగన్నాథ్  తో ఓ మాట అన్నారట.ఆ విషయం చెప్తూ..పూరి జగన్నాథ్....  అబ్బా..ఇంత హైట్ ఉంది. ఒడ్డూ..పొడుగు..ఇంత బాగుంది అమ్మాయి..చాలా బాగుంది..సినిమాలో పెట్టేద్దాం. అన్నారు. నేను అప్పుడు ఈ అమ్మాయిని ఆడిషన్ చేద్దాం అన్నాను.

ఆడిషన్ ఏమి అక్కర్లేదు.పెట్టేద్దాం అన్నారు. ఆ అమ్మాయి అన్ని నాకు తెలియదు..తెలియదు అంటోంది సార్ అన్నాను.అదో చిన్న టెన్షన్  ఉంది నాకు. సరదాగా ఫోటోలు అయినా తీద్దాం అన్నాను నేను. అయినా నాగార్జున గారు అక్కర్లేదు ..ఓకే చెప్పేయ్ అంటూ మొదటిసారి నాగార్జున అన్నమాటలు , ఆయన ఎదటి వారిలో టాలెంట్ ని అంచనా వేయగలిగే శక్తిని చెప్పారు. నాగ్ అంచనా వేసినట్లే అనుష్క తెలుగులో నెంబర్ వన్ స్దాయికి ఎదిగింది అనేది నిజం. 


ఇక బెంగళూరులో యోగా టీచర్ గా పని చేస్తున్న అనుష్కను టాలీవుడ్ లోకి తీసుకొచ్చింది ఆయనే. తన సంస్థలో తీసిన ‘సూపర్’ సినిమాలో ఛాన్స్ ఇప్పించిన నాగ్.. ఆ తర్వాత కూడా అనుష్క కెరీర్ విషయంలో సలహాలిచ్చి, తన సినిమాల్లో అవకాశాలిప్పించి ఆమె స్టార్ హీరోయిన్ గా నిలబడ్డానికి సాయపడ్డారు. నాగ్ విషయంలో అనుష్క కూడా కృతజ్నత మరిచిపోలేదు. హీరోయిన్ గా తన ప్రస్థానం గురించి మాట్లాడినప్పుడల్లా నాగ్ ప్రస్తావన తెస్తుంది అనుష్క. 
 


ఓ ఇంటర్వ్యూ లోనూ తనకు నాగ్ చేసిన సాయం గురించి  అనుష్క  చెప్తూ..‘‘నేనీ స్థాయిలో ఉండటానికి చాలామంది కారణం. నాగార్జున - పూరి జగన్నాథ్ - శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. వీళ్లందరికీ నా కెరీర్ తాలూకు క్రెడిట్ ఇవ్వాలి. ముఖ్యంగా నాగార్జున గారు సూపర్ సినిమా సమయంలో ఎంత బాగా చూసుకున్నారో చెప్పలేదు. సెట్లో నన్నో చిన్నపిల్లలా ట్రీట్ చేశారు. పరిశ్రమ గురించి నాకేం తెలియదు. ఎలా ఉండాలో అర్థమయ్యేది కాదు.

ఆ సమయంలో ఆయన ‘కష్టపడు. ఎదగడానికి అందుకు మించిన మార్గం లేదు’ అని నాగార్జున చెప్పిన మాటలు నా చెవిలో మార్మోగుతూనే ఉంటాయి. నా తొలి ఏడాది చాలా గందరగోళంగా నడిచింది. నేను సినిమాలు చేయను. ఇంటికెళ్లిపోతా, చదువుకుంటా అని ఏడ్చేదాన్ని. అలాంటిది పదేళ్లకు పైగా కెరీర్ కొనసాగిందంటే నాగార్జున సహా దర్శకులు నిర్మాతలిచ్చిన ప్రోత్సాహమే కారణం’’ అని అనుష్క చెప్పింది.

Latest Videos

click me!