The Ghost Movie Review
కథ
ఇంటర్ పోల్ అధికారి అయిన విక్రమ్(నాగార్జున) ఒక ఆపరేషన్ లో ఫెయిల్ అవుతాడు. ఆ కారణంగా ఓ బాలుడు మాఫియా చేతిలో మరణిస్తాడు. అందుకు పశ్చాత్తాపానికి గురైన విక్రమ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తారు. అతడు మాఫియా పై పగ తీర్చుకోవాలని రగిలిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో విక్రమ్ కి సిస్టర్ నుండి ఒక కాల్ వస్తుంది. తన కూతురిని ఒక మాఫియా చంపే ప్రయత్నం చేస్తుంది కాపాడాలని వేడుకుంటుంది. దీంతో విక్రమ్ రంగంలోకి దిగుతాడు. అసలు విక్రమ్ మేనకోడలిని చంపాలనుకుంటుంది ఎవరు? వాళ్ళ నేపథ్యం ఏమిటీ? విక్రమ్ మేనకోడలిని ప్రమాదం నుండి ఎలా కాపాడాడు? అనేదే మిగతా కథ.
The Ghost Movie Review
దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఎమోషన్స్ జోడించి ది ఘోస్ట్ తెరకెక్కించారు. ఇంటర్ పోల్ ఆఫీసర్ కి మేనకోడలిని మాఫియా నుండి కాపాడుకునే బాధ్యత అప్పగించాడు. ఈ క్రమంలో అన్నా చెల్లెలు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశాడు. ఇది కొంత మేరకు పర్వాలేదు అనిపించింది.రోటీన్ యాక్షన్ ఎంటర్టైనర్ కి భిన్నంగా మూవీ రూపొందడంలో సాయపడింది.
The Ghost Movie Review
ప్రవీణ్ సత్తార్ రాసుకున్న కథలో విషయం ఉంది. స్క్రీన్ ప్లే విషయంలోనే కొంచెం తడబడ్డాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ సన్నివేశాలు ఒకింత ఇబ్బంది పెట్టాయి. ఇంటర్వెల్ ముందు వరకు కథనం మెల్లగా సాగుతుంది. అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ తో మొదలుపెట్టినప్పటికీ ఆ టెంపో కొనసాగించలేకపోయాడు. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ మళ్ళీ అద్భుతంగా రూపొందించాడు. ట్విస్ట్ కూడా బాగుంది.
The Ghost Movie Review
సెకండ్ హాఫ్ విషయంలో ప్రవీణ్ ప్రతిభ చూపించారు. పరుగులు తీసే కథనం ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు బీజీఎమ్ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. సినిమా ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కింది. ఎడిటింగ్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఇక కింగ్ నాగార్జున స్టైలిష్ లుక్ అదిరిపోగా, యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. ఆయన నవమన్మధుడు అనడంలో సందేహం లేదు.
The Ghost Movie Review
హీరోయిన్ సోనాల్ కి మంచి పాత్ర దక్కింది. ఆమె తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఆమె గ్లామర్, హీరో నాగార్జునతో రొమాన్స్ బాగా కుదిరాయి. నాగ్-సోనాల్ కెమిస్ట్రీ వెండితెరపై పండింది. కీలక రోల్స్ చేసిన గుల్ పనాగ్, అనికా నరేంద్రన్ మంచి నటనతో ఆకట్టుకున్నారు.
మొత్తంగా ది ఘోస్ట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్స్ ఇష్టపడేవారికి ఫీస్ట్ లా ఉంటుంది. ఉన్నత నిర్మాతను విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం కొంత మేర మెప్పిస్తుంది. బలవంతంగా జొప్పించినట్లున్న ఎమోషనల్ సన్నివేశాలు, ఫస్ట్ హాఫ్ సినిమాకు మైనస్. లేదంటే ఫలితం మరోలా ఉండేది. అయితే నాగ్ స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు, కథ, బీజీఎమ్ అలరిస్తాయి. పెద్దగా అంచనాలు లేకుండా వెళితే ది ఘోస్ట్ ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్
కథ
నాగార్జున
యాక్షన్ ఎపిసోడ్స్
బీజీఎమ్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హ్లాఫ్
ఎమోషనల్ సన్నివేశాలు
పూర్తి స్థాయిలో మెప్పించని స్క్రీన్ ప్లే
రేటింగ్: 3/5
సునీల్ నారంగ్, పూసుకుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ది ఘోస్ట్ చిత్రాన్ని నిర్మించారు. మార్క్ కె రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా... భరత్-సౌరభ్ సాంగ్స్ కంపోజ్ చేశారు. ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్ గా వ్యవహరించారు. ముకేష్ జి సినిమాటోగ్రఫీ అందించారు.