నయనతార తన పెళ్లిని “నయనతార – బియాండ్ ది ఫెయిరీ టేల్” పేరుతో డాక్యుమెంటరీగా తీయించారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ డాక్యుమెంటరీలో నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమకథ, పెళ్లి వైభోగం అంతా ఉంది. నెట్‌ఫ్లిక్స్ 25 కోట్లు ఇచ్చిందట.
25
నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి
2022 జూన్ 9న పెళ్లి జరిగింది. ఈ జంటకు ఉలక్, ఉయిర్ అనే కవల పిల్లలు. పెళ్లయ్యాక కూడా నయనతార స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న కథలనే ఎంచుకుంటున్నారు.
35
చైతూ-శోభిత పెళ్లి వేడుక
టాలీవుడ్ స్టార్ జంట నాగ చైతన్య, శోభిత ధూళిపాల కూడా ఒక్కటయ్యారు. 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఘనంగా జరిగింది. సినీ ప్రముఖులు హాజరయ్యారు.
45
చైతూ-శోభిత పెళ్లి డాక్యుమెంటరీ?
చైతూ, శోభిత పెళ్లి డాక్యుమెంటరీ వస్తుందని టాలీవుడ్‌లో టాక్. నెట్‌ఫ్లిక్స్ దీన్ని విడుదల చేస్తుందట. ఫిబ్రవరి 14న, ప్రేమికుల రోజున విడుదల చేస్తారని, 50 కోట్లు ఇచ్చారని ప్రచారం. అయితే, అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.
55
చైతన్య గురించి
నాగ చైతన్య, శోభిత ధూళిపాల తమ పెళ్లిని ప్రైవేట్‌గా చేసుకోవాలనుకున్నారు. అందుకే కొద్దిమంది స్నేహితులు, ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. కాబట్టి ఇలా వస్తున్న వార్తలు ఊహాగానాలే అని కొందరు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.