పుష్పలత తమిళ సినిమాలోని ప్రముఖ హీరోలైన ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ లతో కలిసి నటించారు. ఇక ఎన్టీఆర్ హీరోగా కోవెలమూడి భాస్కర్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన చెరపకురా.. చెడేవు అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు పుష్పలత.
ఆ తర్వాత ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమనిషి, రంగూన్ రౌడీ, విక్రమ్ వంటి చిత్రాలలో నటించి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.