బన్నీ (Allu Arjun) కెరీర్ లో అట్టర్ ప్లాప్ గా నాపేరు సూర్య మిగిలిపోయింది. ఆ సినిమా దెబ్బకు అల్లు అర్జున్ రెండేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. నాగబాబు నిర్మాతగా సినిమా అంటే అది అట్టర్ ప్లాప్ అవుతుందనే సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది. ప్రతిసారి జరుగుతుంటే ఎవరైనా నమ్మాల్సిందే. ఓ ప్రక్క చిరంజీవి, పవన్ (Pawan Kalyan), చరణ్ లతో చిత్రాలు చేసి గీతా ఆర్ట్స్ ఎక్కడికో వెళ్ళిపోయింది.