పింక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న కృతి సనన్.. కుర్రాళ్లను ఆకర్షిస్తున్న బాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్స్..

Published : May 27, 2022, 05:25 PM ISTUpdated : May 27, 2022, 05:26 PM IST

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ (Kriti Sanon) వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు ఆడియెన్స్ కు కూడా చాలా దగ్గరైన ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.  

PREV
16
పింక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న కృతి సనన్.. కుర్రాళ్లను ఆకర్షిస్తున్న బాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్స్..

స్టార్ హీరోయిన్ కృతి సనన్ బాలీవుడ్ లో బిజీయేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. విభిన్న పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ‘బచ్చన్ పాండే, హీరోపంథి2’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.
 

26

ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ బ్యూటీ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ‘షెహజాదా, బేధియా, గణపత్’ సినిమాల్లో నటిస్తోంది. ఇందులో బేధియాా చిత్రం షూటింగ్ పార్ట్ తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడ పూర్తి చేసుకుంది. మిగితా రెండు చిత్రాల్లో కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.

36

ఇక మరో భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ (Adhipurush)లోనూ నటిస్తోంది.  పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన ‘సీత’ పాత్రను పోషిస్తోంది కృతి. ఈ మూవీ కోసం ఇప్పటికే ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఎంతో ఎదరుచూస్తున్నారు. వచ్చే ఏడాది విడుదల కానుంది.
 

46

‘ఆదిపురుష్’ చిత్రంతో  కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను ముచ్చటగా మూడోసారి అలరించనుంది. ఇప్పటికే మహేశ్ బాబుతో ‘1 : నేనొక్కడినే’, నాగ చైతన్యతో ‘దోచెయ్’ చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో పెద్దగా క్రేజ్ సంపాదించలేకపోయింది. 
 

56

కానీ ‘ఆదిపురుష్’తో సౌత్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకోనుందని ఆమె ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. త్వరలో ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కూడా రానున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. 
 

66

లేటస్ట్ ఫొటోషూట్ తో ఆకట్టుకుంటోంది. ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. పింక్ డ్రెస్ లో చాలా క్యూట్ గా కనిపిస్తోంది. చూడగానే ఆకట్టుకునేలా ఉంది తన ఆహార్యం. మత్తేక్కించే చూపులతో ఈ బ్యూటీ నెటిజన్లను తనవైపు తపి్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories