షారుఖ్ ఇంట్లో ఎన్ని టీవీలు ఉన్నాయి..? వాటి కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..?

Published : May 27, 2022, 04:53 PM IST

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన ఇంట్లో ఉన్న టీవీలెన్ని.. వాటికి ఎంత  ఖరీదు పెట్టాడో రివిల్ చేశారు. ఓ  బ్రాండ్ ఈవెంట్లో పాట్లొన్న బాద్ షా.. టీవీల గురించి ఇంట్రెస్టింగ్ వియాలు చెప్పారు.   

PREV
18
షారుఖ్ ఇంట్లో ఎన్ని టీవీలు ఉన్నాయి..? వాటి కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..?

మూవీ స్టార్స్ ఖరీదైన వస్తువులు వాడటం సహజం. ఈ విషయాలు తెలుసుకోవాలి అని ఫ్యాన్స్ ఆశపడటం కూడా సహజం. చాలామంది స్టార్స్ ఇంట్లో కార్లు, హీరోల వాచ్ లు, బట్టలు.. ఇలా చాలా కాస్ట్లీ విషయాలు వైరల్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇంట్లో టీవీలు  సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అవుతున్నాయి. 
 

28

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్‌  కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్టు లేకుండా ఎదిగిన ఈ స్టార్ కి దేశమంతా భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అభిమానులు ప్రేమగా బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. అంతేకాదు.. ఆయన ఏ పని చేసినా అదే స్థాయిలో ఉంటుంది. 
 

38

తాజాగా షారుఖ్ తన ఇంట్లో ఉన్న టీవీల సంఖ్య గురించి, వాటి ధర గురించి వివరంగా చెప్పి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. తన  ఇంట్లో ఎన్ని టీవీలు ఉన్నాయి. వాటి ధర ఎంతా.. ఇంత వరకూ టీవీలకోసం ఎంత ఖర్చు పెట్టింది వివరంగా తెలిపారు షారుఖ్. 

48

తాజాగా షారుఖ్ ఓ బ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అందులో మాట్లాడుతూ.. నాకు బెడ్‌రూమ్‌లో ఒక టీవీ ఉంది. నా గదిలో ఒకటి ఉంది. నా చిన్న కొడుకు అబ్‌రామ్‌ గదిలో మరొకటి ఉంది. అలాగే ఆర్యన్‌ గదిలో, నా కుమార్తె గదిలో ఒక్కొటి చొప్పున ఉన్నాయి. ఇటీవలే నా జిమ్‌లో ఉన్న ఇతర కంపెనీల టీవీలు పాడైపోయాయి అన్నారు. 

58

నేను మంచి టీవీ కోసమే వేచి చూస్తున్నాను అందుకే నేను వెంటనే ఎల్‌జీని కంపెనీ టీవీని కొనుగోలు చేశాను అన్నారు. ఇలా పాతది పాడైన పోయిన ప్రతిసారి వెంటనే వెళ్లి కొత్త టీవీని కొంటూనే ఉంటా. ఇప్పటికీ నా ఇంట్లో మొత్తం  12 టీవీల వరకూ ఉన్నాయి. ఒక్కోదాని ధర లక్ష నుంచి లక్షన్నర ఉంటుంది అన్నారు. 

68

అంటే ఈ లెక్కన నేను కేవలం టీవీల కోసమే ఇప్పటి వరకూ నేను దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాను అని చెప్పుకొచ్చారు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ చెప్పిన ఈ లెక్కలకు బాలీవుడ్ ఆడియన్స్ నొరెళ్లబెట్టారు. చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

78

షారుఖ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా వెంటనే వైరల్ అవ్వడం మామూలే కదా. అన్నింటిలాగే దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్‌ గా మారింది. దీంతో ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్, ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. 

88

అందులో ఓ నెటిజన్ అయితే.. షారుఖ్ దగ్గర 30 నుంచి 40 లక్షల విలువ చేసే టీవీలు ఉన్నాయా? ఇది చూస్తే నేను చాలా పేదవాడిని అనిపిస్తోంది అంటూ ట్వీట్  చేశాడు. మరొకరు.. ఆ టీవీల ధర మా ఇంటి ధర అంత ఉంది అని.. అందుకే కింగ్ ఖాన్ అంటారని ఇంకొకరు కామెంట్స్ చేశారు. ఇలా వరుసగా కామెంట్లు వస్తూనే ఉన్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories