ఇండస్ట్రీ ఎవరి సొంతం కాదని, ఎవరైనా రావచ్చు, టాలెంట్ నిరూపించుకోవచ్చు, గొప్పగా ఎదగొచ్చు అని చెప్పాడు. అమ్మాయిలు కూడా ఎదిగే అవకాశం ఉంది. సినిమా మేల్ డామినేషనే కాదు, ఆడవాళ్లు కూడా రావాలి. వాళ్లు కూడా గొప్పగా ఎదగాలి. హీరోయిన్‌గానే కాదు, టెక్నీషియన్లుగానూ ఎదగాల్సిన అవసరం ఉంది. ఆ వైపు చాలా లోటు గ్యాప్ ఉంది. ఆ వైపు కూడా దృష్టి పెట్టాలి. ఎవరైనా మిమ్మల్ని అడ్డుకుంటే ఆగకుండా మీరేంటో చూపించండి, అన్నింటిని దాటుకుని రండి. ఎవరికీ భయపడకండి. తెలంగాణలోనూ, ఆంధ్రాలోనూ ఆడపిల్లలకు అద్భుతమైన సేఫ్టీ ఉందని, ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే, ఏదైనా చేస్తే మడత పెట్టి లోపల పెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు. వాళ్ల తాట తీస్తాం.ఆ విషయంలో టెన్షన్ లేదు అని చెప్పాడు.