మెగాస్టార్ చిరంజీవి... టాలీవుడ్‌కి పెద్ద దిక్కు. తెలుగులో ఆయన్ని మించిన స్టార్ లేడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంత మంది యంగ్ స్టార్స్ వచ్చినా, వారి సినిమాలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసినా, టాలీవుడ్‌కి ఆయనే మెగాస్టార్. బాలీవుడ్‌కి బిగ్ బీ ఎలాగో, టాలీవుడ్ కి చిరు అలా. అలాంటి మెగాస్టార్.. అమితాబ్ బచ్చన్ కాళ్ల మీద పడి ఎమోషనల్ అయ్యాడు. మరి ఆ కథేంటో చూస్తే..
పూరీ జగన్నాథ్.. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో `బుద్దా హోగా తేరా బాప్`(2011) అనే చిత్రాన్ని రూపొందించారు. అమితాబ్‌తో పూరీ సినిమా అంటే మామూలు కాదు. దీనికి కారణం రామ్ గోపాల్ వర్మ. బిగ్ బీతో వర్మ ఆల్‌రెడీ సినిమాలు చేసిన నేపథ్యంలో ఆ పరిచయంతో పూరీని పరిచయం చేశారు. పూరీ ఐదు నిమిషాల్లో లైన్ చెప్పగానే అమితాబ్ ఓకే చెప్పాడట.
ఈ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో ప్రీమియర్ ప్రదర్శించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్.. చిరంజీవిని ఓ రిక్వెస్ట్ చేశారు. చిరు అప్పటికే సినిమాలు మానేసి రాజకీయాల్లో బిజీ అయ్యారు. కానీ అప్పటికే చిరు 149 సినిమాలు చేశారు. అది సరైన నెంబర్ కాదని, మరో సినిమా చేసి 150 సమం చేయాలని కోరారు అమితాబ్. దీనికి చిరంజీవి కూడా రియాక్ట్ అవుతూ `రీ థింక్ చేస్తాన`ని తెలిపారు.
ఆయన ఈ ప్రకటనతో వర్మ మైక్ తీసుకుని `రీ థింక్ అంటే డిసీషన్ మేడ్`(నిర్ణయం అయిపోయింది) అని ప్రకటించారు. ఆ తర్వాత చిరంజీవి ఒప్పుకుంటే తానే డైరెక్ట్ చేస్తానని ప్రకటించారు దర్శకుడు పూరీజగన్నాథ్. అమితాబ్ నోటితో ఆ ప్రకటన చేయించారు. ఇది విన్న చిరంజీవి ఆనందంతో ఒప్పొంగిపోయారు. అయితే కాసేపు ఆలోచించి.. తాను ఓ కోరిక కోరారు. వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో, పూరీ జగన్నాథ్ డైరెక్టర్‌గా సినిమా చేస్తానని, కానీ ఇందులో అమితాబ్ ఒక్క గెస్ట్ రోల్ చేయాలని కోరారు చిరు.
దీంతో మరో మాట లేకుండా స్టేజ్‌పైనే తనకు ఓకే అంటూ ప్రకటించారు అమితాబ్ బచ్చన్. దీంతో హాల్ మొత్తం దద్దరిళ్లింది. ఎప్పుడు సినిమా చేసినా, తాను నటించేందుకు సిద్ధమే అని వెల్లడించారు. దీంతో ఆనందాన్ని తట్టుకోలేకపోయిన చిరు, ఆ స్టేజ్‌పైనే అమితాబ్ కాళ్లపై పడ్డాడు. అది అప్పట్లో హైలైట్‌గా, సంచలనంగా మారింది. అంతేకాదు అమితాబ్ బచ్చన్‌ని హగ్ చేసుకుని ఎమోషనల్‌గా రియాక్ట్ అయ్యారు చిరు. ఈ అరుదైన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది.
ఇదిలా ఉంటే ఆ తర్వాత చిరంజీవి 150వ సినిమా చేయలేదు. పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపి ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. 2014లో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ప్లాన్ చేశారు. 2017లో `ఖైదీ నెంబర్ 150` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత `సైరా నరసింహారెడ్డి` అనే పీరియాడికల్ హిస్టారికల్ మూవీ చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్ గెస్ట్ గా నటించారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. ఇది వచ్చే సంక్రాంతికి విడ