అందరి ముందు నిహారిక పరువు తీసిన నాగబాబు.. చిన్నప్పుడు ఏం చేసిందో తెలుసా?

Published : Aug 06, 2024, 12:46 PM IST

మెగాడాటర్‌ నిహారిక మెగా ఫ్యామిలీలో అల్లరి అమ్మాయి అనే కామెంట్ ఉంది. అయితే ఆమె చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు బయటపెట్టాడు నాగబాబు.   

PREV
15
అందరి ముందు నిహారిక పరువు తీసిన నాగబాబు.. చిన్నప్పుడు ఏం చేసిందో తెలుసా?
Niharika Konidela

మెగా డాటర్ నిహారిక.. యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. హీరోయిన్‌గా మారి సినిమాలు చేసింది. కానీ నటిగా ఆమె సక్సెస్‌ కాలేకపోయింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెట్‌ అయ్యింది. కానీ రెండేళ్లలోనే భర్తతో విడిపోయింది. ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలో తాను సినిమాలపై ఫోకస్‌ పెట్టింది. ఓవైపు యాక్టర్ గా మరోసారి తానేంటో నిరూపించుకునేందుకు వస్తుంది. అదే సమయంలో నిర్మాతగానూ యాక్టీవ్‌గా ముందుకెళ్తుంది. 
 

25
Nagababu - Niharika

అందులో భాగంగా మొదటిసారి ఆమె సినిమాని నిర్మించింది. `కమిటీ కుర్రోళ్లు` పేరుతో ఓ మూవీని నిర్మించింది. ఇది ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ఇందులో ఫాదర్‌ నాగబాబు కూడా పాల్గొన్నాడు. ఆయన మాట్లాడుతూ నిహారిక పరువు తీశాడు. ఆమె చిన్నప్పుడు చేసిన పని బయటపెట్టి షాకిచ్చాడు. ఇక్కడ ఎవడి సెల్ఫ్‌ డబ్బా వాడే కొట్టుకోవాలని,అందరు అదే చేస్తున్నారని, తాను నిహారిక గురించి చెప్పాలని నాగబాబు ఆమె సీక్రెట్‌ బయటపెట్టాడు.

35

 మరి నిహారిక చిన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? నిహారిక తన స్వీటెస్ట్ డాటర్‌ అని చెప్పిన నాగబాబు.. మూడు, నాలుగేళ్ల ఏజ్‌లో ఆమె చేసిన పని చెప్పాడు. కాస్త పెద్దగా అయ్యింది కాబట్టి, ఇండిపెండెంట్‌గా పడుకోమని చెప్పేవారట నాగబాబు, ఆయన భార్య పద్మ. మొదట బాగానే వెళ్లేదట. కానీ మదర్‌ అటు కిచెన్‌లోకి వెళ్లగానే వచ్చిన బెడ్‌లో దూరేదని, అమ్మకి కనిపించకుండా తన షర్ట్ లోకి దూరేదని, అల్లరి బాగా చేసేదని చెప్పాడు నాగబాబు. 

45

నాగబాబు తన కూతురు గురించి పాజిటివ్‌గా చెప్పినా, బెడ్‌ మ్యాటర్‌ రాగానే అటు నిహారికా, అలాగే పక్కన ఉన్న వాళ్ల అమ్మ పద్మ కూడా ముఖం చాటేశారు. ఫేస్‌కి చేయి అడ్డుపెట్టుకుని సిగ్గు పడ్డారు. పాపం ఇబ్బంది పడటం గమనార్హం. కానీ ఇది చూసేవారికి హిలేరియస్‌గా అనిపించింది. హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆడవాళ్ల గురించి, అమ్మాయిల గురించి గొప్పగా చెప్పాడు నాగబాబు. ఇప్పుడు అన్ని రంగాల్లో ఆడవాళ్లు దూసుకుపోవాలని, మీకు అడ్డే లేదని, ఎవరు ఆపాలని చూసిన భయపడొద్దని, ధైర్యంగా ముందుకెళ్లాలని, తమ టాలెంట్‌ చూపించాలని, నటిగానే కాదు టెక్నీషియన్‌ విభాగంలోనూ రాణించాలని చెప్పాడు నాగబాబు. ఆడపిల్లలపై ఎవడైనా ఏదైనా చేస్తే మడతపెట్టి లోపల వేసేస్తామని వెల్లడించారు నాగబాబు. 
 

55

నిహారికా `ఢీ జూనియర్స్` షోకి యాంకర్‌గా చేసింది. ఆ తర్వాత ఆమె హీరోయిన్‌గా మారి `ఒక మనసు`, `హ్యాపీ వెడ్డింగ్‌`, `సూర్యకాంతం` చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీస్‌ ఆడలేదు. ఆ తర్వాత చిరంజీవి `సైరా`లోనూ గెస్ట్ గా చిన్న పాత్రలో మెరిసింది. కానీ ఇది కూడా ఆడలేదు. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యింది. చైతన్య జొన్నలగడ్డతో ఆమెకి 2020 డిసెంబర్‌9న వివాహమైంది. 2023 జులైలో విడిపోయారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories