Bigg Boss Telugu 8: కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది? ఇందులో మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఉన్నాడా?

First Published | Aug 6, 2024, 12:14 PM IST


లాంచింగ్ ఎపిసోడ్ కి ముందే బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లీకైంది. మరి మీరు మెచ్చే సెలెబ్ లిస్ట్ లో ఉన్నాడో లేడో చూడండి. 
 

Bigg boss telugu 8


బిగ్ బాస్ సీజన్ 8 మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. హోస్ట్ అక్కినేని నాగార్జున వరాలిచ్చే కింగ్ ని, ఒక్కసారి కమిట్ అయితే అన్ లిమిటెడ్ అంటూ ఈ నయా సీజన్ పై మరింత ఆసక్తి పెంచేస్తున్నారు. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం బీబీ ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 1 లేదా మొదటి వారంలో బిగ్ బాస్ 8 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 

Bigg boss telugu 8

బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ పాత్ర కీలకంగా ఉంటుంది. షో హిట్ అవ్వాలన్నా .. మంచి టీఆర్పీ రేటింగ్స్ రాబట్టాలన్నా అది హౌస్ లోకి వెళ్లిన  కంటెస్టెంట్స్  పై ఆధారపడి ఉంటుంది. వాళ్ళు హౌస్ లో ఎంత రచ్చ చేస్తే జనాలు కూడా అంతే ఇంట్రెస్ట్ గా చూస్తారు. ఓ వైపు తిట్టుకుంటూనే షో చూడటం మాత్రం మానరు. సీజన్ 6 అతి తక్కువ టిఆర్పి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణం కంటెస్టెంట్స్. యూట్యూబ్, సోషల్ మీడియా బ్యాచ్ తో ఎదో అలా నడిపించేశారు. ఆ సీజన్ పరమ బోరింగ్ అనిపించుకుంది. 
 



అందుకే ప్రత్యేక శ్రద్ధ వహించి సీజన్ 7 ని విజయవంతం చేశారు. ఇదే జోష్ లో సీజన్ 8 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక, సెట్ వర్క్ వంటి  పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారట. కింగ్ నాగార్జున సీజన్ 8 కి కూడా హోస్ట్ గా  కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ప్రోమో ద్వారా దీనిపై కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. చాలా రోజులుగా బిగ్ బాస్ 8 కి ఎంపికైన కంటెస్టెంట్స్ విల్లే అంటూ కొంతమంది సెలెబ్స్ పేర్లు వైరల్ అవుతున్నాయి. 

Bigg boss telugu 8

అలాగే దీనికి సంబంధించి రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తుంది. ఈ క్రమంలో తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ పరిశీలిస్తే .. రీతూ చౌదరి, నటి సన, అంజలి పావని, మై విలేజ్ షో అనిల్ గిలా, యాదమరాజు, యాంకర్ వింధ్య, కిర్రాక్ ఆర్పీ, బంచిక్ బబ్లు, గాయత్రి గుప్తా, కుమారి ఆంటీ తదితర పేర్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. అలాగే న్యూస్ రీడర్ కళ్యాణి, రేఖ భోజ్, ఆర్గానిక్ ఫార్మింగ్ నేత్ర, సీరియల్ నటుడు ఇంద్రనీల్, సింగర్ సాకేత్, హీరో అబ్బాస్, రోహిత్, ఊర్మిళ చౌహాన్ వంటి పేర్లు వైరల్ అవుతున్నాయి. 

Bigg boss telugu 8

వారిలో ఎవరు హౌస్ లోకి వెళ్తారు అనేది మాత్రం తెలియాలంటే  గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే చివరి నిమిషం వరకు ఎంపికైన ఏ ఒక్క సభ్యులు కన్ఫర్మ్ అని చెప్పలేము. 

Latest Videos

click me!