అనసూయ సినిమా టికెట్లు ఫ్రీగా కావాలా? అయితే ఈ పనిచేయండి.. ఆడియెన్స్ కి బంపర్ ఆఫర్‌!

First Published | Aug 6, 2024, 9:59 AM IST

అనసూయ నటిస్తున్న `సింబా` టీమ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఫ్రీగా సినిమా టికెట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కానీ ఆ పని చేయాలని ట్విస్ట్ ఇచ్చింది. 
 

అనసూయ అందంతో అలరిస్తూనే నటనతో మెప్పిస్తుంది. బుల్లితెరపై ఆమె అందాల విందు చేసింది. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ట్రీట్‌తో ఆకట్టుకుంటుంది. కానీ సినిమాల్లో మాత్రం దానికి దూరంగా ఉంటుంది. నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలే చేస్తానని చెప్పింది. అయితే డిమాండ్‌ మేరకు ఐటెమ్స్ సాంగ్స్, గ్లామర్‌ రోల్స్ కూడా చేసేందుకు రెడీనే గతంలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె `హరిహర వీరమల్లు` ఓ మాంచి ఐటెమ్‌ నెంబర్ చేస్తుందని సమాచారం. మరోవైపు `పుష్ప 2`లో నెగటివ్‌ రోల్‌తో అలరించేందుకు వస్తుంది. 

ఇప్పుడు `సింబా`లో మరో సారి నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. సినిమాకి ఆమెదే మెయిన్‌ రోల్‌ అని తెలుస్తుంది. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. చెట్లు నాటడం, చెట్లు పెంచడం, ప్రకృతిని పరిరక్షించడమనే కాన్సెప్ట్ తో `సింబా` చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సందేశాన్ని సస్పెన్స్ క్రైమ్‌ థ్రిల్లర్‌గా చెబుతున్నారట. డైరెక్ట్‌గా సందేశం చెబితే వినే రోజులు కావివి, దానికి షుగర్‌ కోట్‌ వేసి చెబితేనే జనాలకు ఎక్కుతుందని, అందుకే ఈ జోనర్లో సినిమా చేశామని అనసూయ, దర్శకుడు మురళీ మనోహర్‌, నిర్మాత దాసరి రాజేందర్‌ రెడ్డి వెల్లడించారు. 
 

Latest Videos


ఈ సందర్భంగా హీరో శ్రీనాథ్‌, దర్శకుడు, నిర్మాతలు ఆడియెన్స్ కి బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. చెట్లు నాటి తనకు ఫోటోలు పంపిస్తే `సింబా` సినిమాకి సంబంధించిన టికెట్లు ఫ్రీగా ఇస్తామని వెల్లడించారు. ఈ ఆఫర్‌ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని, ఫ్రీగా సినిమా చూసే అవకాశాన్ని పొందాలని తెలిపారు. సినిమా ఎవరినీ నిరాశ పరచదని కచ్చితంగా ఓ థ్రిల్లింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుందని దర్శకుడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుని స్టేజ్‌పైనే ఎమోషనల్‌ అయ్యాడు. 
 

డైరెక్టర్ మురళీ మనోహర్ మాట్లాడుతూ, ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన ఫ్యామిలీ గురించి చెబుతూ స్టేజ్ మీద కంటతడి పెట్టేసుకున్నాడు. టీమ్‌ ఎంతో సహకరిచిందని, వాళ్ల సపోర్ట్ లేకుంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదన్నారు. మురళీ మనోహర్ లండన్ ఫిల్మ్ స్కూల్‌లో సినిమా కోర్సులు నేర్చుకున్నాడు. లండన్‌లోనే రెండు ఇండీ సినిమాల కోసం అక్కడి ప్రొడక్షన్ కంపెనీల్లో పని చేశాడు. ఇండియాకు వచ్చి ఎన్నో షార్ట్ ఫిల్మ్స్‌ తీశాడు. సంపత్ నంది వద్ద `ఏమైంది ఈ వేళ`, `రచ్చ`, `బెంగాల్ టైగర్`, `గౌతమ్ నందా` చిత్రాలకు పని చేశాడు. `గాలి పటం` చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా, `పేపర్ బాయ్` చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ పని చేశాడు. ఇప్పుడు సింబాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 

దర్శకుడు సంపత్‌ నంది ఈ మూవీకి కథ అందించారు. ఆయనే సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ, ఈ మూవీ చేయడానికి కారణం ఉదయభాను అని, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆమె నన్ను ఛాలెంజ్‌ చేసిందని, ఆ తర్వాత ఎంపీ సంతోష్‌, మాజీ సీఎం కేసీఆర్‌ తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నాను. ఆ సమయంలోనే ఇలాంటి కథతో సినిమా ఎందుకు చేయకూడదనిపించింది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ సినిమా అని, కనువిప్పు కలిగేలా, ఎంటర్‌టైనింగ్‌గా, మంచి సందేశాత్మకంగా సినిమా ఉంటుంద`న్నారు సంపత్‌ నంది.  ఇక `సింబా` చిత్రం ఈ నెల 9న విడుదల కాబోతుంది. 

click me!