జబర్దస్ షోకి నాగబాబు అదిరిపోయే రీ ఎంట్రీ.. తన అడ్డాలో కూర్చుని 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ, రచ్చ చేసిన అనసూయ

Published : Jul 09, 2025, 07:03 PM IST

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతుంది. రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ షోకి పర్మనెంట్ జడ్జీలు అంటూ ఎవరూ లేరు.

PREV
15

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోకి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతుంది. రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత ఆ షోకి పర్మనెంట్ జడ్జీలు అంటూ ఎవరూ లేరు. తాత్కాలికంగా మనో, ఖుష్బూ లాంటి వారిని జడ్జీలుగా పెట్టి మేనేజ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో జబర్దస్త్ షో పాపులారిటీ కూడా తగ్గుతూ వచ్చింది.

25

జబర్దస్త్ షో నిర్వాహకులతో నాగబాబు విభేదించి మరో ఛానల్ కి వెళ్లి అదే తరహాలో ఒక కామెడీ షోని ప్రారంభించారు. అది అంతగా వర్కౌట్ కాలేదు. చాలాకాలం తర్వాత ఎట్టకేలకు నాగబాబు జబర్దస్త్ షోలోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సందర్భంగా మల్లెమాల సంస్థ అదిరిపోయే ప్రోమో రిలీజ్ చేసింది.

35

జబర్దస్త్ ప్రారంభమై 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మెగా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ కు సంబంధించిన ప్రోమోని ఇప్పుడు రిలీజ్ చేశారు. జబర్దస్త్ షో తో గుర్తింపు పొందిన సీనియర్ కమెడియన్లు చమ్మక్ చంద్ర, అదిరే అభి లాంటి వారంతా ఈ ఎపిసోడ్లో కనిపించబోతున్నారు. అనసూయ, హైపర్ ఆది లాంటి వారు వేదికపై రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నాగబాబుకి గ్రాండ్ వెల్కమ్ దక్కింది. ఓజీ చిత్రంలోని 'అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే' అనే డైలాగ్ తో నాగబాబుకి జబర్దస్త్ యూనిట్ వెల్కమ్ చెప్పింది.

45

అనసూయ కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు. గతంలో అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ ని ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. చాలాకాలం తర్వాత నాగబాబు తన జడ్జి స్థానంలో కూర్చున్నారు. కావలసిన వాడు వచ్చినప్పుడు ఆనందపడాలి కాని ఆశ్చర్యపోతారేంట్రా.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ నాగబాబు అదరగొట్టారు.

55

అయితే ఇక నుంచి నాగబాబు జబర్దస్త్ షోలో జడ్జిగా కొనసాగుతారా అనేది ఇప్పుడే క్లారిటీ లేదు. అందుతున్న సమాచారం మేరకు నాగబాబు కేవలం 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడానికి గెస్ట్ గా మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. నాగబాబు ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories