ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు చెబుతూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు.. ఎందుకూ పనికిరారు అనుకునే వాళ్ళు అంటూ..

First Published | Oct 17, 2024, 10:26 AM IST

మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. పొలిటికల్ గా అయినా, సినిమాల గురించి అయినా నాగబాబు చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతుంటాయి. నాగబాబు చాలా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు.

మెగా బ్రదర్ నాగబాబు అప్పుడప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. పొలిటికల్ గా అయినా, సినిమాల గురించి అయినా నాగబాబు చేసే వ్యాఖ్యలు వైరల్ అవుతుంటాయి. నాగబాబు చాలా చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశారు. మహేష్ బాబు, రవితేజ, సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోలతో కలసి నటించారు. 

గతంలో ఓ కార్యక్రమంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మాస్ మహారాజ్ రవితేజని ప్రశంసిస్తూ నాగబాబు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. నాగబాబు మాట్లాడుతూ.. కొంతమంది నేను ఎందుకు పనికిరాను నా జీవితం ఇంతే అని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లంతా రవితేజ జీవితం గురించి తెలుసుకోవాలి. రవితేజ తన కెరీర్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. 

Also Read : మహేష్ బాబు మూవీ ఫ్లాప్ అని అందరిలో భయం..ఆయనొక్కడే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ముందుగానే


అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు లేని పాత్రలు చేశాడు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ స్టార్ హీరోల్లో ఒకడయ్యాడు. కాబట్టి రవితేజ జీవితం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని నాగబాబు కోరారు. టాలీవుడ్ లో ఎనెర్జిటిక్ యంగ్ హీరోలు అంటే అందరూ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ పోతినేని పేర్లు చెబుతారు. 

అలాంటి యంగ్ హీరోలతో కూడా పోటీ పడే సత్తా రవితేజకి ఉంది అంటూ నాగబాబు ప్రశంసించారు. ఎనెర్జిటిక్ గా డైలాగులు చెప్పాలన్నా, ఫైట్స్, డ్యాన్సులు చేయాలన్నా టాలీవుడ్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తో పాటు రవితేజ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. 

నాగబాబు.. రవితేజతో కలసి మిరపకాయ్ చిత్రంలో నటించారు. వీళ్ళిద్దరూ ఈ మూవీలో పోలీస్ అధికారులు గా నటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిరపకాయ్ చిత్రం మంచి విజయం సాధించింది. 

Latest Videos

click me!