#Pushpa-2:ఎక్సలేటర్ రైజ్ చేసిన సుక్కు, ‘యానిమల్‌’ యాక్టర్ ని సీన్ లోకి...

First Published | Oct 17, 2024, 8:40 AM IST


‘పుష్ప 2’లో ‘యానిమల్‌’ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. నటుడు బ్రహ్మాజీ పోస్ట్‌ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబోలో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. గతంలో ఈ కలయికలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ సినిమా పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచేలా టీమ్ నుంచి , నటుల నుంచి పోస్ట్ లు వస్తున్నాయి. 

Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


తాజాగా ‘పుష్ప 2’ (Pushpa 2)లో తన పాత్రకు సంబంధించి షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ఓ ఫొటో షేర్ చేసారు. అందులో బ్రహ్మాజీ, సుకుమార్‌, మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil)తోపాటు ‘యానిమల్‌’ (Animal) ఫేమ్‌ సౌరభ్‌ సచ్‌దేవ (Saurabh Sachdeva) కనిపించారు.

బ్రహ్మాజీ పోస్ట్‌పై రెస్పాండ్ అవుతున్న నెటిజన్లు, సినీ అభిమానులు ‘సుకుమార్‌ భారీగా ప్లాన్‌ చేస్తున్నారు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘యానిమల్‌’లో బాబీ దేవోల్‌కు సోదరుడిగా నటించి ఆకట్టుకున్నారు సౌరభ్‌.

Latest Videos


Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2


మరో ప్రక్క  ఈ చిత్రం గురించి పుష్ప-2 సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్‌ లైవ్‌ కన్‌సర్ట్‌ గురించి ఏర్పాటు చేసిన ఓ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ''పుష్ప-2 ఇటీవల ఫస్ట్‌ హాఫ్‌ చూశాను. మైండ్‌ బ్లోయింగ్‌గా వుంది. పుష్ప కథను ఇప్పుడే కాదు స్క్రిప్ట్‌ విన్నప్పుడే నేను లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ మూడు సార్లు క్లాప్స్‌ కొట్టాం..

సుకుమార్‌ కథ చెబుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్వెలా.. ఇక్కడ ఇంటర్వెలా అని మేము అంటున్నాం.. అంతలా మాకు ప్రతి సీన్‌ కిక్‌ ఇచ్చింది. ప్రతి సీన్‌లోనూ ఎంతో ఎనర్జీ వుంటుంది. సినిమా చూసినప్పుడు సుకుమార్‌ కథను రాసిన విధానం  సినిమాను తెరకెక్కించిన తీరు, అల్లు అర్జున్‌ నటించిన విధానం నెక్ట్స్‌ లెవల్‌లో వుంటుంది. సినిమా నెక్ట్స్‌ లెవల్‌ సినిమా అంతే.. ఇక ఫస్ట్ హాఫ్‌ అయితే సూపర్‌గా వుంది అంతే..అని అన్నారు. 

0 రోజుల్లో బాక్సాఫీసు ముందుకు..

డిసెంబరు 6న సినిమా విడుదల కానుందని గుర్తుచేస్తూ టీమ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ‘‘పుష్ప: ది రూల్‌’ ఫస్ట్‌ షో ఎక్కడ చూడబోతున్నారు?’’ అంటూ అభిమానులను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది. ‘పుష్ప’ పార్ట్‌ 1 మంచి విజయం సాధించడం, ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కు జాతీయ అవార్డు రావడంతో పార్ట్‌ 2పై అంచనాలు తారస్థాయికి చేరాయి.

దాంతో, ‘పుష్ప2’ కథకు మరిన్ని హంగులు జోడించి సుకుమార్‌ తీర్చిదిద్దుతున్నారు.  ఈ సినిమాలోనూ ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా ఫహాద్‌ ఫాజిల్‌, శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘సూసేకి’, ‘పుష్ప పుష్పరాజ్‌’ పాటలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి.

   తెలుగు పరిశ్రమలో మోస్ట్ రెస్పెక్టబుల్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరనే సంగతి తెలిసిందే. దర్శకుడుగా రాజమౌళి తర్వాత ఆ రేంజి ఫాలోయింగ్ ఉన్న దర్శకుడు ఆయనే  . తను తీసే సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉండేలా చూసుకుంటూ, అదే సమయంలో కమర్షియల్ విలువలుని సినిమాలో మేళవిస్తూ సూపర్ హిట్లు కొడుతున్నారు.

రాజమౌళిలా బాహుబలి, ఆర్ఆర్ఆర్ తరహా ఎపిక్ మూవీస్ తీయకపోయినా.. సుకుమార్‌కు ప్రేక్షకుల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉండటానికి అదే కారణం. కథల్లో, టేకింగ్‌లో ఆయన చూపించే వైవిధ్యమే ముఖ్య కారణం. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమాలో చూపించిన సినిమాటిక్ బ్రిలియన్స్‌కు ఎంతోమంది ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
 

click me!