Nagababu LoveStory: నాగబాబు లవ్‌ స్టోరీ, జెలసీతో రగిలిపోయాడట.. పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు

Published : May 02, 2026, 12:45 PM IST

మెగాబ్రదర్‌ నాగబాబు తన క్రేజీ లవ్‌ స్టోరీని బయటపెట్టాడు. అమ్మాయిలు తనని చూసేవారు కాదని, కానీ వాళ్ల విషయంలో జెలసీగా ఫీలయ్యేవాడట. ప్రేమ విషయంలో తాను బాధపడ్డ సందర్భాన్ని వెల్లడించాడు నాగబాబు. 

PREV
14
మెగాబ్రదర్‌ నాగబాబు స్ట్రెయిట్‌ ఫార్వర్డ్

మెగా బ్రదర్ నాగబాబు గురించి టాలీవుడ్‌లో ఒక ముద్ర ఉంది. ఆయన చాలా స్ట్రెయిట్‌ ఫార్వర్డ్. మనసులో ఏదీ దాచుకోరు, ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీపై ఎవరైనా విమర్శలు చేస్తే, అడ్డుగోడలా నిలబడి గట్టి కౌంటర్లు ఇచ్చేది ఆయనే. చిరంజీవి గారు ఎప్పుడూ హుందాగా, ఆచితూచి మాట్లాడుతుంటే.. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కానీ, మెగా కుటుంబానికి ఒక అనధికార ప్రతినిధిలా నాగబాబు వ్యవహరిస్తుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉండగా, నాగబాబు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు.  అదే సమయంలో లవ్‌ స్టోరీని వెల్లడించారు.

24
నాగబాబు లవ్‌ స్టోరీ

నాగబాబు తన టీనేజ్ రోజుల్లో అమ్మాయిలను విపరీతంగా ఆరాధించేవారట. అయితే, ఆయన ప్రేమ అంతా 'వన్ వే ట్రాక్' అని స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. `నేనేం చూడటానికి బాగుండను అని కాదు, కానీ ఒక్క అమ్మాయి కూడా నన్ను పట్టించుకునేది కాదు. కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు` అని నవ్వుతూ చెప్పారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తనను ఇష్టపడని అమ్మాయిలు వేరే అబ్బాయిలను ప్రేమిస్తుంటే చూసి నాగబాబు జెలసీగా ఫీలయ్యేవారట. `వాళ్లు ప్రేమించే అబ్బాయిల కంటే నేనే బాగున్నాను కదా, వీళ్లలో వాళ్లకేం నచ్చింది?` అని లోలోపల మదనపడేవారట. అమ్మాయిల మీద ఇష్టం ఉన్నా, అది చెప్పే ధైర్యం మాత్రం ఆయనకు ఉండేది కాదట. పొరపాటున ఎవరైనా అమ్మాయి తన వైపు చూస్తే, భయంతో అక్కడి నుండి పారిపోయేవాడినని తన భగ్న ప్రేమని సరదాగా గుర్తు చేసుకున్నారు. ఆ మధ్య `కమిటీ కుర్రోళ్లు` మూవీ ఈవెంట్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు నాగబాబు.

34
ఫ్రెండ్స్ ని ఇరికించిన నాగబాబు

నెల్లూరులో ఉన్నప్పుడు లీలా మహల్ థియేటర్లో ఇంగ్లీష్ సినిమాలు చూడటం నాగబాబుకు బాగా అలవాటు. ఒకవేళ తను చూసిన సినిమా అస్సలు బాగోకపోతే, తన స్నేహితులను కూడా ఆ సినిమాలో ఇరికించాలని ప్లాన్ చేసేవారట. `సినిమా అదిరిపోయింది, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అద్భుతం` అని అబద్ధం చెప్పి వాళ్లను పంపించేవారట. వాళ్లు సినిమా చూసి వచ్చి తిడుతుంటే అది చూసి ఆనందించేవాడినని ఆయన చెప్పారు.

44
నాగబాబులో జెలసీ

అంతేకాకుండా, తన స్నేహితుల్లో ఒకరు కమల్ హాసన్ లాగా అద్భుతంగా డాన్స్ చేసేవారట. నాగబాబుకు డాన్స్ రాకపోవడంతో, అసూయతో ఆ స్నేహితుడి డాన్స్‌ను మధ్యలోనే చెడగొట్టేందుకు ప్రయత్నించేవారట. ఇలాంటి చిన్న చిన్న కొంటె పనులతో తన యవ్వన కాలం సాగిపోయిందని ఆయన వివరించారు. నాగబాబు బయట ఎంత గంభీరంగా కనిపిస్తారో, లోపల అంతటి సరదా మనిషి అని ఈ విషయాల ద్వారా మరోసారి నిరూపితమైంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories