చిరంజీవిని అవమానించిన ఆ స్టార్ హీరో... శపథం చేసి మెగాస్టార్ గా మారిన చిరు..

Published : Aug 22, 2022, 11:12 AM ISTUpdated : Aug 22, 2022, 11:16 AM IST

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుడి నుంచి టాలీవుడ్ మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి జీవితంలో ఎన్నో కష్టాలు, మరెన్నో అవమానాలు. వాటిని దాటుకుని ఈ స్థాయిలో నిలబడ్డారు చిరు. ఇక చిరంజీవికి జరిగిన ఓ అవమానం, ఆతరువాత ఆయన చేసిన శబథం గురించి మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా రివిల్ చేశారు. 

PREV
17
చిరంజీవిని అవమానించిన ఆ స్టార్  హీరో... శపథం చేసి మెగాస్టార్ గా మారిన చిరు..

సినిమా అవకాశాల కోసం 21 సంవత్సరాల వయసులో మద్రాసు వెళ్లిన చిరంజీవి ఎన్నో కష్టాలను ఓర్చుకుని మెగాస్టార్ గా మారారు. ఆయన సింపుల్ గా ఈ స్టేజ్ కు రాలేదు. ఎన్నో ముళ్ల దారులను దాటుకుని వచ్చారు. చాలా చిన్న వయస్సులో హీరో అవ్వాలని వెళ్ళిన చిరుకు  ఎదురైన సంఘటన గురించి మెగా బ్రదర్  నాగబాబు అభిమానులతో పంచుకున్నారు.  చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మెగాస్టార్‌ బర్త్‌డే కార్నివాల్‌ వేదికపై నాగబాబు మాట్లాడారు. 
 

27

నాగబాబు మాట్లాడుతూ.. అన్నయ్య 21 ఏళ్ళ వయస్సులో మద్రాస్ వెళ్ళారు.. అక్కడ ముగ్గురు కలిసి ఒక రూమ్ లో ఉండేవారు. కమెడియన్ కమ్ హీరో సుధాకర్, హరిప్రసాద్ తో పాటు చిరంజీవి కలిసి ఉండేవారు. 200 రూపాయల జీతంతో మా నాన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ గా మమ్మల్ని పోషించేవారు. అలాంటి కష్టాల్లోంచి వచ్చాము మేవు అన్నారు మెగా బ్రదర్. 

37

మద్రాసులో తిండీ తిప్పలే లేకుండా కష్టపడుతున్న సమయంలో అన్నయ్య ఉంటున్న రూమ్ పక్కన్న  పూర్ణ పిక్చర్స్‌ ఆఫీస్‌ ఉండేది. ఆ సంస్థ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంగారు ఆయన భార్య కు అన్నయ్య అంటే ఎంతో అభిమానం ఉండేది.  అన్నయ్యతో పాటు  ఉన్న వారిని కూడా బిడ్డల్ల చూసేవారు. వారి అబ్బాయి సూర్య కూడా ఈ ముగురితో స్నేహంగా ఉండేవాడు.. అన్నారు  నాగబాబు. 

47

చిరంజీవి హీరోగా ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో ఆయనకు ఓ అవమానం జరిగింది. ఆ పట్టుదలే ఆయన్ను హీరోగా నిలబెట్టింది. స్టార్ ను చేసింది అన్నారు మెగా బ్రదర్. ఓ రోజు అన్నయ్యను.. ఆయన స్నేహితులను సుబ్రహ్మణ్యం గారు పిలిచి అప్పట్లో స్టార్ హీరో  సినిమా ఒకటి రిలీజ్ అయితే.. ప్రివ్యూ చూడమని థియేటర్‌లో కూర్చొబెట్టారు.  కాని కొంత సమయానికి .. ఆ సినిమా హీరో, ఆయన  మనుషులు వచ్చారు. సీట్లు ఖాళీ లేకపోవడంతో చిరంజీవి, ఆయన మిత్రులను ఇద్దరినీ లేపి వెనుక నిలబెట్టి అవమానించారు. అలాగే నిలబడి చిరంజీవి గారు ఆ సినిమా చూశారట.  
 

57

సినిమా ఎలా ఉందో తెలుసుకోవడానికి అన్నయ్యకు సుబ్రహ్మణ్యంగారు... ఆయన భార్య  కబురు పంపించారట. అయితే అప్పటికే తనకు జరిగిన అవమానంతో బాధ,ఆవేశం కలిసి ..  కోపంతో రగిలిపోయారట చిరు.  సినిమా ఎలా ఉందని అడగగానే.. సినిమా బాగానే ఉంది కానీ.. మీ తరఫున వెళ్లిన మమ్మల్ని హీరో తాలుక మనుషులు అవమానించారు.. గుమ్మం దగ్గర నిలబెట్టారు. బయటకు వస్తే మీ పరువు పోతుందని .. మీకు చెడ్డ పేరు వస్తుందని ఆలోచించాము అన్నారట చిరంజీవి. 
 

67

ఆ హీరో అంతే.. నువ్వు పట్టించుకోకు అని ఆవిడ చిరంజీవికి సర్థి చెప్పు ప్రయత్నం చేయగా..  లేదు అదంతా అహంకారం.. వీళ్లందరు బాగా బలిసి కొట్టుకుంటున్నారు .... అని అంటూ.. చిరంజీవి శబథం చేశారట.. చూస్తు ఉండండీ ఈ ఇండస్ట్రీకి నేను  నంబర్‌ వన్‌ హీరో కాకపోతే నన్ను అడగండి అని ఆరోజే  శబథం చేశారట మెగాస్టార్. అయితే చిత్రం ఏంటంటే.. ఈవిషయం మెగాస్టార్ కు గుర్తు లేదు. కాని ఆ దంపతులు తనయుడు సూర్య మాత్రం గుర్తు పెట్టుకుని నాగబాబుతో చెప్పారట. ఈ  ప్రస్తావన మెగాస్టార్ దగ్గర తీయ్యగా.. గుర్తు లేదు అన్నారట నా గబాబుతో. 

77

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు లాంటి స్టార్లు ఏలుతున్న టైమ్ లో ... అప్పటికీ ఎటువంటి గుర్తింపు లేని సామాన్య వ్యక్తి నేనే నెంబర్ వన్ అవుతా అని చెప్పడం సాధారణ విషయం కాదు. ఆ ధైర్యం ఆ కుర్రాడికి  ఎక్కడి నుంచి వచ్చింది. యూత్ కు గోల్స్‌ చాలా ఉంటాయి. మోటివేషన్‌, అఛీవ్‌ చేయాలనే తపనా ఉంటే తప్పకుండా సాధిస్తారు. దానికి చిరంజీవి బెస్ట్ ఎక్జాంపుల్ అన్నారు నాగబాబు.   ఏదైనా సాధించాలి అంటే దాని కోసం తపనపడంది.. కష్టపడండి.. చిరంజీవిలా ఎదో ఒక రోజు సాధిస్తారు అని అన్నారు నాగబాబు. 

click me!

Recommended Stories