అల్లు అర్జున్ సినిమా ఎవ్వరికీ తెలియని ఓ గాడ్ కథ

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మైథలాజికల్ మూవీస్ తీయడం ఎందుకు తగ్గిపోయిందో తనకు తెలియదని.. కానీ తాము అల్లు అర్జున్, త్రివిక్రమ్‌తో కలిసి ఓ మైథలాజికల్ సినిమా రూపొందిస్తున్నట్లు చెప్పారు. 'ఈ మూవీ చూసి భారతదేశం ఆశ్చర్యపడుతుంది.

Naga Vamsi hints at a massive Mythological film with Allu Arjun in Telugu jsp
Naga Vamsi hints at a massive Mythological film with Allu Arjun in telugu


ఇన్నాళ్లుగా రూమర్ గా ఉన్న విషయం ,నిజమే అని తేల్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ.  అల్లు అర్జున్‌.. దర్శకుడు త్రివిక్రమ్‌ల కలయికలో రూపొందనున్న కొత్త సినిమా దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేలా ఉంటుందన్నారు ఆయన .

ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ ఈ నెల 28న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ  - త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్‌పై నోరు విప్పారు నాగవంశీ.

Naga Vamsi hints at a massive Mythological film with Allu Arjun in telugu


నాగవంశీ మాట్లాడుతూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమ పౌరాణిక చిత్రాల్ని నిర్మించడం ఎందుకు ఆపేసిందో నాకర్థం కావడం లేదు. ప్రస్తుతం మేము అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌లతో నిర్మించనున్న సినిమా ఓ భారీ పౌరాణిక చిత్రంగానే ఉండనుంది. మన పురాణాల్లో ఎవరికీ అంతగా తెలియని ఓ కథతో రూపొందించనున్నాం. అలాగని ఇది పూర్తిగా ఫిక్షనల్‌ పాత్రేమీ కాదు.

 పురాణాల్లోని ఆ దేవుడు గురించి అందరికీ పరిచయమున్నప్పటికీ.. తన జీవితంలో ఏం జరిగిందన్నది ఎవరికీ అంతగా తెలియదు. ఆ కోణాన్నే మేము ఈ చిత్రంలో భారీ స్కేల్‌లో చూపించనున్నాం. కచ్చితంగా ఈ సినిమా స్థాయిని చూసి భారతదేశం మొత్తం ఆశ్చర్యపోతుంది’’ అని చెప్పారు నాగవంశీ.  


Naga Vamsi hints at a massive Mythological film with Allu Arjun in telugu


ఏదేమైనా ఈ చిత్రమైతే ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూవీస్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి.

 ఈ క్రమంలో వీరి కాంబోలో వస్తోన్న సోషియో మైథలాజికల్ ఫాంటసీ 'AA22' ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 సమ్మర్‌లో ఈ మూవీ సెట్స్‌పైకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈలోగానే అల్లు అర్జున్‌.. దర్శకుడు అట్లీతో ఓ సినిమా పట్టాలెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Latest Videos

vuukle one pixel image
click me!