లైవ్ షోలో ప్రముఖ సింగర్ సోనూ నిగమ్‌ పై రాళ్లు, సీసాలతో దాడి

బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌పై ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో రాళ్ల దాడి జరిగింది. ఎంగిఫెస్ట్ 2025లో ప్రదర్శన ఇస్తుండగా కొందరు రాళ్లు విసరడంతో ఆయన షోను ఆపేశారు.

Sonu Nigam faces stone pelting during his recent concert at Delhi  in Telugu jsp
Sonu Nigam faces stone pelting during his recent concert at Delhi in telugu


 ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌(Singer Sonu Nigam)పై రాళ్ల దాడి(Stone Attack) జరిగింది. అయితే ఈ ఘటన లేటుగా వెలుగులోకి వచ్చింది.

ఆదివారం  ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ(DTU)లో జరిగిన ఎంగిఫెస్ట్ 2025(Engifest 2025) సందర్భంగా చోటు చేసుకుంది. సోనూ నిగమ్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇస్తున్న సమయంలో లక్షకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.

Sonu Nigam faces stone pelting during his recent concert at Delhi  in Telugu jsp
Sonu Nigam faces stone pelting during his recent concert at Delhi in telugu


లైవ్ షో జరుగుతుండగా.. సమూహంలోని కొందరు రాళ్లు, ప్లాస్టిక్ బాటిళ్లను వేదిక వైపు విసిరారు. ఈ దాడి వల్ల ఆయన తన షోను మధ్యలోనే ఆపాల్సి వచ్చింది.

ఈ సంఘటనలో సోనూ నిగమ్ గాయపడలేదని, కానీ అతని టీమ్ లోని కొందరు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
 


Sonu Nigam faces stone pelting during his recent concert at Delhi in telugu


 విద్యార్థులు ఇలా చేయడంతో సింగర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత సోను చాలా ప్రశాంతంగా కనిపించారు. విద్యార్థులు గౌరవంగా ప్రవర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనమందరం మంచి సమయం గడపాలని, నేను మీ కోసం ఇక్కడికి వచ్చినట్లు సోను అన్నారు.

ఆనందించాలని, కానీ దయచేసి ఇలా చేయకూడదని సోను ప్రేక్షకులను కోరాడు.  పరిస్థితి అదుపులోకి వచ్చాక సోనూ నిగమ్ తన షోను కొనసాగించడం విశేషం. అయితే ఈ దాడి గురించి ఇటు సోనూ నిగమ్ గాని, అటు వర్శిటీ నిర్వాహకులు గాని ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 

Latest Videos

vuukle one pixel image
click me!