యువ హీరో నాగశౌర్య టాలీవుడ్ లో హార్డ్ వర్కింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. జయాపజయాలు పక్కన పెడితే సిల్వర్ స్క్రీన్ పై తన ప్రత్యేకత చాటుకోవాలని ప్రయత్నించే నటుడు నాగశౌర్య. నాగ శౌర్య ఖాతాలో ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద, ఛలో, అశ్వద్ధామ లాంటి విజయాలు ఉన్నాయి. అయితే నాగ శౌర్య ఛలో లాంటి సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. నేడు నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ 'కృష్ణ వ్రింద విహారి'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.