నాగార్జున సినిమాల్లో మన్మథుడిగా పేరుతెచ్చుకున్నారు. రొమాన్స్ కి కింగ్‌గా ఆయన్ని పిలుస్తుంటారు. ఆయన లుక్, ఫిట్‌నెస్ చూస్తుంటే ఇప్పటికీ నవమన్మథుడిలా కనిపించడం విశేషం. అయితే సినిమాల్లో ఆయన రొమాన్స్ కి మంచి పేరుంది. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం తండ్రిని మించిపోయాడట కొడుకు నాగచైతన్య. ఆయన మామూలోడు కాదు, తండ్రి నాగార్జునకి బురిడీ కొట్టించి అమ్మాయిని మెయింటేన్ చేశాడట.
28
నాగార్జునకి తెలియకుండా గర్ల్‌ఫ్రెండ్‌ని మెయింటేన్ చేశాడట నాగచైతన్య. ఈ విషయాన్ని నాగ్ జయప్రద ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాగచైతన్య గురించి తెలియని ఓ సీక్రెట్ చెప్పాలని ఆమె అడగ్గా, నాగ్ ఈ బండారాన్ని బయటపెట్టాడు. చైతూకి గర్ల్ ఫ్రెండ్ ఉండదని, కానీ అది ఎవరో తనకు తెలియదన్నారు నాగ్.
38
నాకు తెలిసి నాగచైతన్యకి గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. ఆరు నెలలుగా నేను ట్రై చేస్తున్నా, పట్టుకోవడానికి కానీ దొరకడం లేదు. అడిగితే చైతన్య చెప్పడం లేదట. ఎవరూ లేరు నాన్న అంటున్నాడట. చాలా సార్లు వాచ్ మెన్‌ని కూడా అడిగాను, ఎవరొస్తున్నారు నైట్ అని, ఇప్పటికీ కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాను.
48
ఆరు నెలల్లో నేను ఒక్కడినే ఉండాలనుకుంటున్నా అంటున్నాడు చైతన్య. ఎందుకు ఏం అవసరం ఉందని అడుగుతున్నా, చెప్పడం లేదు. కానీ ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలని జయప్రదకి చెప్పాడు నాగ్. ఎప్పుడో పదేళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూ ఇది. ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆసక్తికరంగా మారింది.
58
నాగచైతన్య.. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఇంటర్వ్యూ జరిగే సమయంలో ఆయన సమంతతోనే లవ్ లో ఉన్నాడా లేక మరో అమ్మాయిని మెయింటేన్ చేశాడా అనేది మాత్రం పెద్ద సస్పెన్స్.
68
2016లో నాగచైతన్య, సమంతలు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో వెల్లడించారు. మొదట వాళ్లు ఒప్పుకోకపోయినా ఆ తర్వాత ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7తేదీల్లో మ్యారేజ్ చేసుకున్నారు. నాలుగేళ్లకి విడిపోయారు. ఇప్పుడు ఇద్దరు ఒంటరిగానే ఉంటున్నారు.
78
అయితే నాగచైతన్య ఇప్పుడు మళ్లీ ప్రేమలో పడ్డారని సమాచారం. హీరోయిన్ శోభితా దూళిపాళ్లతో ఆయన డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఇద్దరు మీడియా కంటకూడా పడ్డారు. కానీ అది బయటకు రాకుండా గుట్టుగా మెయింటేన్ చేస్తున్నారని టాక్. మరి నిజం ఏంటో తెలియాల్సి ఉంది.
88
Sai Pallavi, Naga Chaitanya
ప్రస్తుతం నాగచైతన్య.. `తండేల్` చిత్రంలో నటిస్తున్నారు. చందుమొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. దసరాకి విడుదల కాబోతుంది.