ముఖ్యంగా హైపర్ ఆది.. ఢీ షోతో పాపులర్ అయిన యంగ్ డ్యాన్సర్ శ్వేతా నాయుడు తల్లిదండ్రులని టార్గెట్ చేశాడు. కెలుక్కుని మరీ పరువు పోగొట్టుకున్నాడు. శ్వేతాకి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు అని హైపర్ ఆది ఆమె తల్లిదండ్రులని అడిగాడు. ఆమె తండ్రి.. మంచి అబ్బాయి దొరికితే చేస్తాం అని అన్నారు. అంటే నేనొచ్చి అడుగుతున్నాను.. నేను మంచి అబ్బాయిని కాదా అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వ్యక్తి,, ఏంటి నీకు ఇంకా పెళ్లి కాలేదా అంటూ హైపర్ ఆది పరువు తీశాడు.