నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నారని, వీరిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. సమంత పీఆర్ టీం ఈ రూమర్స్ సృష్టించారంటూ ఓ మీడియాలో వచ్చిన కథనాన్ని ట్యాగ్ చేసిన సమంత ఒక విధంగా ఫైర్ అయ్యారు. ఓ అమ్మాయిపై రూమర్స్ వస్తే అవి నిజాలు, అబ్బాయిపై వస్తే వాటి వెనుక అమ్మాయి ఉందంటారా?.. అంటూ ట్వీట్ చేశారు.