ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ(jnanamba)తన కోడలి ఇద్దరిని తీసుకొని బారసాల వేడుకకు వెళుతుంది. అక్కడ కామాక్షి అనే ఆమె జానకిని ఏమైనా విశేషం ఉందా అని అడగడంతో జానకి మౌనంగా ఉండిపోతుంది. అప్పుడు జ్ఞానాంబ అలాంటిది ఏమీ లేదు అని చెప్పి పాపను ఉయ్యాలలో పడుకోబెడుతుంది. ఆతర్వాత కామాక్షి(kamakshi), జ్ఞానాంబ కోడళ్లకు హారతి పాటలు వస్తాయా అని అనగా వెంటనే మల్లిక తన మాటలతో ఓవర్ చేస్తుంది.