వందలాది చిత్రాల్లో దాదాపు అలనాటి సీనియర్ హీరోలందరి సరసన నటించిన ఏకైక హీరోయిన్ శ్రీదేవి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించిన ఈమె ఇటు సౌత్, అటు నార్త్ ఆడియెన్స్ కు ఎన్నటికీ మరిచిపోలేనంత గా దగ్గరైంది. తన అందం, అభినయంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.