వైరల్ గా నాగ చైతన్య-శోభితల పెళ్లి కార్డ్, అందులో స్టెప్ ఫాదర్, మదర్ పేరు కూడా!

First Published | Nov 17, 2024, 5:37 PM IST

అక్కినేని వారి ఇంట పెళ్లి బాజా మోగింది. నాగ చైతన్య పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. నాగ చైతన్య వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతుంది. 
 

Naga Chaitanya-Sobhita Dhulipala Marriage

నాగ చైతన్య-శోభితలు డిసెంబర్ 4న పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. పెద్దలు ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ చేశారు. బంధువులు, సన్నిహితులు, ప్రముఖులకు పెళ్లి కార్డులు పంచుతున్నారు.  వెడ్డింగ్ కార్డ్ తో పాటు బహుమతులు అందిస్తున్నారు. నాగ చైతన్య-శోభితల పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Naga Chaitanya-Sobhita Dhulipala Marriage

కాగా పెళ్లి కార్డులో పొందుపరిచిన పేర్లు హాట్ టాపిక్ గా మారాయి. వరుడు నాగ చైతన్య తల్లితో పాటు స్టెప్ మదర్, ఫాదర్ పేర్లు ఉన్నాయి. నాగ చైతన్య సన్ ఆఫ్ శ్రీ అక్కినేని నాగార్జున, అమల అని రాశారు. క్రింద శరత్ విజయరాఘవన్ అండ్ లక్ష్మి కమల అని ప్రింట్ చేశారు. నాగ చైతన్యకు అమల స్టెప్ మదర్ కాగా, శరత్ స్టెప్ ఫాదర్ అవుతారు. అలాగే కార్డులో ఏఎన్నార్ దంపతులు, డి. రామానాయుడు దంపతుల పేర్లు కూడా పొందుపరిచారు.  
 


కాగా చాలా రోజుల క్రితమే శోభిత ధూళిపాళ్ల ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆ ఫోటోలు శోభిత తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పంచుకున్నారు. 'గోధుమరాయి పసుపు దంచడం' అని సదరు ఫోటోలకు క్యాప్షన్ జోడించారు. హిందూ వివాహ సాంప్రదాయంలో పసుపు దంచడం అతి ముఖ్యమైన ఆచారంగా ఉంది. ఈ కార్యక్రమంతో శోభిత-నాగ చైతన్య పెళ్లి వేడుకలు మొదలైనట్లు తెలుస్తుంది. 

ఇక వైజాగ్ లో వివాహం జరగనుందట. అక్కడే పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారట. శోభిత వైజాగ్ లో చదువుకోవడం విశేషం. ఇక రెండేళ్లకు పైగా నాగ చైతన్య-శోభిత రిలేషన్ లో ఉన్నారు. అప్పుడప్పుడు వీరి ప్రైవేట్ ఫోటోలు లీక్ అవుతూ ఉండేవి. ఎఫైర్ రూమర్స్ ని పలుమార్లు ఈ జంట ఖండించారు. సడన్ గా ఆగస్టు 8న నిశ్చితార్థం జరుపుకుని షాక్ ఇచ్చారు. నాగార్జున కొత్త కోడలు శోభిత ధూళిపాళ్లకు అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలికాడు. 
 

Naga Chaitanya

శోభిత-నాగ చైతన్యల వివాహం నేపథ్యంలో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తంగా ప్రేమికులుగా ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. 

శోభిత ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెనాలిలో పుట్టిన తెలుగు అమ్మాయి. ఆమె మోడలింగ్ చేశారు. ముంబైలో ఆమె కెరీర్ మొదలైంది. బాలీవుడ్ లో శోభిత ఎక్కువ చిత్రాలు చేసింది. తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాలు చేసింది. చిత్రీకరణ దశలో ఉన్న గూఢచారి 2లో సైతం శోభిత నటిస్తుట్లు సమాచారం. మంకీ మ్యాన్ టైటిల్ తో తెరకెక్కిన ఓ హాలీవుడ్ చిత్రం లో కూడా ఆమె నటించారు. 
 

Naga Chaitanya

ఇక నాగ చైతన్యకు ఇది రెండో వివాహం అన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ మనస్పర్థలతో 2021లో విడిపోయారు. ఇక నాగ చైతన్య కెరీర్ పరిశీలిస్తే.. చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ కాగా ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది. 

Latest Videos

click me!