Sobhita Dhulipala: 45కోట్ల ఇంట్లో నాగచైతన్య, శోభితా.. పెళ్లికి ముందే అంతా ప్లాన్‌.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Published : Dec 31, 2025, 01:19 PM IST

నాగచైతన్య, శోభితా గతేడాది పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు జుబ్లీ హిల్స్ లోని ఖరీదైన ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ ఇంటి కాస్ట్, దాన్ని స్పెషాలిటి గురించి తెలుసుకుందాం. 

PREV
16
ఫస్ట్ మ్యారేజ్‌ యానివర్సరీ పూర్తి చేసుకున్న నాగచైతన్య, శోభితా

అక్కినేని నాగచైతన్య గతేడాది మ్యారేజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే. నటి శోభితా దూళిపాళ్లని ఆయన మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరిది రెండో పెళ్లి. చైతూ అంతకు ముందు హీరోయిన్‌ సమంతతో పెళ్లి అయ్యింది. నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. అందుకు శోభితానే కారణమని టాక్‌. మరోవైపు సమంతకి సంబంధించిన రిలేషన్‌ కూడా ఓ కారణమని అంటున్నారు. కానీ కారణం ఏదైనా చైతూ, సమంత విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. శోభితాతో చైతూకి మ్యారేజ్‌ కాగా, దర్శకుడు రాజ్‌ నిడిమోరుని సమంత పెళ్లి చేసుకుంది.

26
కొత్త లగ్జరీ హౌజ్‌లో నాగచైతన్య, శోభిత

ఇదిలా ఉంటే తమకు పెళ్లై ఏడాది పూర్తయిన సందర్భంగా శోభితా ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. తన ఆనందాన్ని పంచుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు వీరికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం వీరు నివసిస్తున్న ఇంటికి సంబంధించిన సమాచారం మతిపోయేలా ఉంది. కోట్ల విలువ చేసే లగ్జరీ హౌజ్‌లో ఉంటున్నారట. దాని విలువ తెలిస్తే మాత్రం మతిపోవాల్సిందే.

36
నాగచైతన్య కొత్త ఇళ్లు

నాగచైతన్య, శోభితా ఇప్పుడు జూబ్లీహిల్స్ లోని రోడ్‌ నెంబర్‌ 48లో గల తమ ఇంట్లో ఉంటున్నారు. పెళ్లి చేసుకున్నాక ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు.  అయితే దీని ఖరీదు షాకిస్తుంది. ఈలగ్జరీ హౌజ్‌ కాస్ట్ ఏకంగా రూ.45కోట్లు ఉంటుందని సమాచారం. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ ఇళ్లు ఉంటుందని, ఒకప్పటి విలేజ్‌ స్టయిల్‌ని తలపిస్తుందని సమాచారం. సహజంగా ఎండపడేలా, విశాలమైన వరండాలు, హోమ్‌ థియేటర్‌, లైబ్రరీ, జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సౌకర్యాలతో నిండి ఉంటుందట.

46
నాగచైతన్య, శోభితా కొత్తింటి స్పెషాలిటీ

దీంతోపాటు ఓపెన్‌ లే ఔట్‌, విక్టోరియన్‌ స్టయిల్‌ డోర్‌, టెర్రస్‌ గార్డెన్ లు స్పెషల్‌గా డిజైన్‌ చేయించారట. అయితే పెళ్లికి ముందు నుంచే ఈ ఇంటిని చైతూ, శోభితా దగ్గరుండి కట్టించుకున్నారట. ఈ ఇంటి నిర్మాణం విషయంలో చైతూకి ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చాడట నాగార్జున. దీంతో పెళ్లికి ముందే శోభితా కూడా ఇన్‌వాల్వ్ అయి తమకు నచ్చినట్టుగా దీన్ని డిజైన్‌ చేయించారట. అటు తెలుగు ట్రెడిషన్‌, మరోవైపు అత్యధునిక సదుపాయాల మేళవింపుగా ఈ ఇళ్లు ఉంటుందని సమాచారం. 

56
గ్రీనరీకి కేరాఫ్‌గా చైతూ కొత్త ఇళ్లు

ఇందులో మరో విశేషం ఏంటంటే ప్రకృతికి కేరాఫ్‌గా, గ్రీనరీకి అద్దం పట్టేలా ఈ ఇంటి నిర్మాణం చేశారని తెలుస్తోంది. ఇంటి లోపలికి వెళితే మనసు ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుందని టాక్‌. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజం ఎంతా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

66
వృష కర్మతో రాబోతున్న నాగచైతన్య

ఇక నాగచైతన్య ఈ ఏడాది `తండేల్‌` మూవీతో విజయాన్ని అందుకున్నారు. మంచి కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. ఇప్పుడు `విరూపాక్ష` ఫేమ్‌ కార్తీక్‌ దండు దర్శకత్వంలో `వృష కర్మ` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా, అది అదిరిపోయింది. చైతూ మాస్‌ లుక్‌ అదిరిపోయింది. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చైతూకి జోడీగా మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు శోభితా ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌ అని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories