గత కొద్ది కాలంలో ఆంధ్రాలో టిక్కెట్ రేట్ల వ్యవహారంపై తీవ్రమైన చర్చ జరుగుతన్న సంగతి తెలిసిందే. సినిమా టిక్కెట్ల ధరలపై ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుండటం.. దుమారానికి కారణమవుతోంది. మరో ప్రక్క అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణ సర్కార్ వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ధరలు తగ్గించాల్సిందేనని ఏపీ ప్రభుత్వం చెబుతుంటే… రేట్లు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే అదే సమయంలో నాగార్జున...ఏపి ప్రభుత్వ విధానానికి సపోర్ట్ గా ఉన్నట్లు మాట్లాడారు.
ఎన్ని విమర్శలు,ట్రోలింగ్ వచ్చినప్పటికి ఆయన వెనకాడలేదు. మీడియా కూడా దాన్నే బూతద్దంలా చూపెట్టాలని ప్రయత్నిస్తోంది. తాజాగా బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు నాగ చైతన్య. ఆయనను సైతం ఇదే విషయమై మీడియా వారు ప్రశ్నించారు. దానికి నాగచైతన్య చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఇంతకీ చైతూ ఏమన్నారో చూద్దాం.
నాగచైతన్య మాట్లాడుతూ... టికెట్ రేట్స్ గురించి నాన్నతో చాలా డిస్కషన్ జరిగింది. ఏప్రిల్‌లో టికెట్ రేట్స్ జీవో విడుదల చేశారు. మేం ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేశాం. ఏపీలో ఉన్న టికెట్ రేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా బడ్జెట్ వేసుకుని ముందుకు వెళ్లాం. రేపు టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్ అన్నారు.
Bangarraju
అలాగే..టికెట్ రేట్స్ విషయంలో మీకు ప్రాబ్లమ్ ఏమీ లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ...నేను యాక్టర్ అండి. స్టార్టింగ్ నుంచి నటించి రావడం నాకు అలవాటు. సినిమా స్టార్ట్ చేసే ముందు నిర్మాతతో మాట్లాడతాను. 'మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? నా వైపు నుంచి నేను ఏమైనా చేయనా?' అని అడుగుతా. నిర్మాతకు కంఫర్ట్ అయితే... నాకు కంఫర్ట్. నిజంగా ఏదో ఒక కారణంగా డిసైడ్ చేస్తారు. అన్నీ టైమ్‌కు జరుగుతాయి. పరిస్థితులకు తగ్గట్టు ముందుకు వెళ్లాలి అన్నారు.
ఇక దీనికి ముందు చేసిన ధాంక్యూ సినిమాలకు ప్రాబ్లమ్ అవుతుందా? అన్నదానికి సమాధానం ఇస్తూ....'దిల్' రాజుగారు (థాంక్యూ సినిమా నిర్మాత) ఉన్నారు. డిస్కస్ చేశాం. ఆయన నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు.
Bangarraju teaser
. “నేను ఒక యాక్టర్ ని అండీ.. నాకేమీ సమస్య లేదు. కానీ నా నిర్మాతలు బాగున్నారా లేదా అని అడుగుతాను. వాళ్లకు ఇబ్బంది లేకపోతే నేను ఏమైనా చేయగలుగుతాను. నేను ఈ సమస్య గురించి నాన్నతో తరచుగా మాట్లాడుతుంటాను. గతేడాది ఏప్రిల్ 9న జీవో వచ్చింది.. మా సినిమా ఆగస్ట్ లో మొదలైంది. మేము ఆ రేట్ల ప్రకారం మా బడ్జెట్ వేసుకున్నాం. కాబట్టి మాకు ఎలాంటి సమస్య లేదు. అవి పెరిగితే మాకు ఇంకా బోనస్ అవుతుంది'' అని నాగచైతన్య చెప్పారు.
జీవో రాకముందే ప్రారంభమైన 'థాంక్యూ' సినిమాకి ఇది సమస్య కాదా? అని చైతన్య ని ప్రశ్నించగా.. “అది దిల్ రాజు గారు చూసుకుంటారు. మేము దీని గురించి చర్చించాం. దిల్ రాజు గారు చూసుకుంటారని నమ్ముతున్నాను. నేను యాక్టర్ ని. నేను కేవలం నటించి తిరిగి వచ్చేస్తాను. రాజకీయ నిర్ణయాలు కొన్ని కారణాల వల్ల తీసుకుంటారు. అవి మారుతుంటాయి” అని నాగచైతన్య బదులిచ్చారు.
Bangarraju
గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ''బంగార్రాజు'' నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.
Bangarraju
'థాంక్యూ' తర్వాత ప్రాజెక్ట్స్ గురించి చెప్తూ...అమెజాన్ కోసం విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో హారర్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతానికి అది ఒక్కటే కమిట్ అయ్యాను. హారర్ నాకు భయం అయినా... కొత్తగా ట్రై చేస్తున్నాను. హిందీలో చేసిన 'లాల్ సింగ్ చద్దా' ఏప్రిల్ 14న విడుదల అవుతుంది. ఆ సినిమా చేసేటప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. నా కెరీర్ కు సరిపడా తెలుసుకున్నాను. అవకాశం వస్తే ప్రతి యాక్టర్ ఆయనతో ఒక్క సినిమా చేయాలి. ఆయనతో చేయడం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతాం అన్నారు.