అల్లు అర్జున్‌ తొందరపడ్డారు.. `అఖండ` దెబ్బ కొట్టాడు.. బాలయ్య ప్లాన్‌ మైండ్‌ బ్లోయింగ్‌

First Published | Jan 12, 2022, 9:25 PM IST

నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం టాలీవుడ్‌లో ఊపుని తీసుకొచ్చింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లని నింపిన చిత్రమిది. కానీ సంక్రాంతి పండగ సీజన్‌లో అల్లు అర్జున్‌ తొందరపడగా, బాలయ్య పండగ చేసుకోబోతున్నారు. 

బాలకృష్ణ(Balakrishna) నటించిన `అఖండ`(Akhanda) చిత్రం డిసెంబర్‌ 2న విడుదలైంది. ఆ సమయంలో పెద్దగా సినిమాలకు సీజన్‌ కాదు. పైగా కరోనా భయంతో జనం ఉత్సాహంగా, ధైర్యంగా థియేటర్‌కి రాలేని పరిస్థితి. థియేటర్‌లోకి వచ్చేందుకు సుముఖత చూపడం లేదు. కానీ అలాంటి సమయంలో వచ్చిన Akhanda థియేటర్‌ బాక్సులను బ్రేక్‌ చేసింది. బాక్సాఫీస్‌ని షేక్‌ చేసింది. Balakrishna విశ్వరూపం ఆడియెన్స్ కి థియేటర్లో పూనకాలు తెప్పించిందంటే అతిశయోక్తి కాదు. 
 

`అఖండ` చిత్రం Balakrishna కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ సాధించింది. ఇది ఇప్పటి వరకు రూ.125కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం.  `సింహ`, `లెజెండ్‌` తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ హిట్‌ చిత్రమిది. వీరిద్దరి కాంబినేషన్‌కి తిరుగేలేదనేలా చేసింది. సినిమా విడుదలై 40రోజులు దాటింది.  వారం రోజులకే సినిమా పరిమితమైన ఈ రోజుల్లో ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా రన్‌ అవుతుంది.  తాజాగా బుధవారం ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది యూనిట్‌. సంక్రాంతి పండుగ మరో రెండు రోజులకు ముందు మరోసారి సినిమాపై హైప్‌ని క్రియేట్‌ చేసే ప్రయత్నం యూనిట్‌. 


సంక్రాంతి సీజన్‌లో భారీ సినిమాలు లేవు. నాగార్జున,నాగచైతన్య కలిసి నటించిన `బంగార్రాజు` మాత్రం చెప్పుకోదగ్గ పెద్ద సినిమా. మిగిలినవన్నీ కొత్త వాళ్లవే. దీంతో వాటిపై అంతగా ఆడియెన్స్ లో ఫోకస్‌ ఉండదు. నాగ్‌ `బంగార్రాజు` కంప్లీట్‌ డిఫరెంట్‌ చిత్రం. సంక్రాంతి పండుగలా సరదాగా సాగిపోయే ఎంటర్‌టైనర్‌. కానీ మాస్‌ ఆడియెన్స్ ని మెప్పించే ఎలిమెంట్స్ ఇందులో ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. 

దీంతో మాస్‌ ఆడియెన్స్ కి సంక్రాంతికి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ మీల్స్ ఒక్క `అఖండ`లోనే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న చిత్రాల్లో `అఖండ`,`పుష్ప`, `శ్యామ్‌ సింగరాయ్‌` ప్రధానంగా ఉన్నాయి. వీటిలో బన్నీ బన్నీ(Al;lu Arjun) నటించిన `పుష్ప` చిత్రం ఇప్పటికే ఓటీటీలో వచ్చింది. ఇంకా థియేటర్‌కి వెళ్లి జనం చూసే ఛాన్స్ ఉండదు. మరోవైపు `శ్యామ్‌ సింగరాయ్‌` రన్నింగ్‌లో ఉన్నా, మళ్లీ మళ్లీ చూసే పరిస్థితి ఉండదు. 

దీంతో అందరి చూపు ఇప్పుడు `అఖండ` వైపే ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సంక్రాంతి పండక్కి ఆంధ్రాలో ఆడియెన్స్ థియేటర్లో సినిమా చూసేందుకు ఇష్టపడతారు. ఇంటిళ్లిపాది చూసేందుకు స్కోప్‌ ఉంటుంది. ఎందుకంటే ఈ చిత్రంలో లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌, గూస్‌బంమ్స్ తెప్పించే యాక్షన్‌ ఎపిసోడ్‌ లు చాలా ఉన్నాయి. అటు మాస్‌, ఇటు క్లాస్‌ ఆడియెన్స్ కి సైతం `అఖండ` ఫుల్‌ మీల్స్ అందించే చిత్రమవుతుందనే టాక్‌ వినిపిస్తుంది. 

ఈ విషయాన్ని ఊహించే బాలయ్య `అఖండ` టీమ్‌ ఈ రోజు ప్రెస్‌మీట్‌ పెట్టి సినిమా ప్రమోషన్‌ చేశారు. మరోసారి జనాల్లోకి దీన్ని తీసుకెళ్లారు. ప్రెస్‌మీట్‌లో బాలయ్య చేసిన కామెంట్లు సంచలనంగా మారడంతో సినిమా మరింతగా, ఈజీగా జనాల్లోకి వెళ్తుంది. ఇలా సంక్రాంతి సీజన్‌ కూడా `అఖండ`కి కలిసొచ్చే అంశమని చెప్పొచ్చు. 

అయితే ఈ విషయంలో అల్లు అర్జున్‌(Allu Arjun) తొందరపడ్డారు. ఆయన నటించిన `పుష్ప`(Pushpa) చిత్రాన్ని వారం రోజుల ముందే ఓటీటీలో విడుదల చేయించారు. సౌత్‌ భాషలన్నింటిలో ఇది జనవరి 7 నుంచే స్ట్రీమింగ్‌ అవుతుంది. దీంతో థియేటర్‌కి వెళ్లే జనం పూర్తిగా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ క్లోజ్‌ చేసుకునే పరిస్థితి. ఒకవేళ ఈ సంక్రాంతి వరకు ఆగి ఉంటే మరిన్ని కలెక్షన్లు పుష్పకి వచ్చేవి. సినిమా మరో రెంజ్‌కి వెళ్లేదని అంటున్నారు క్రిటిక్స్. `పుష్ప` టీమ్‌ ఈ విషయంలో పెద్ద మిస్టేక్‌ చేసిందని అభిప్రాయపడుతున్నారు. 

దీన్ని క్యాష్‌ చేసుకోబోతుంది `అఖండ` చిత్రం. ఇది జనవరి 21న ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుంది. అంటే సంక్రాంతి సీజన్‌ అయిపోతుంది. ఈ లోపు సంక్రాంతి పండగ సీజన్‌ మొత్తం `అఖండ`కి కలిసొస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ విషయంలో బన్నీ తొందరపాటు, బాలయ్యకి కలిసొచ్చిందని, ఇక `అఖండ`కి పండగే అని అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి బాలయ్య ప్లాన్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పాలి. 

Latest Videos

click me!