మొదటిసారిగా డివోర్స్ పై స్పందించిన నాగచైతన్య.. సమంత గురించి చైతూ ఆసక్తికర వ్యాఖ్యలు..

First Published | May 5, 2023, 9:58 PM IST

అక్కినేని నాగచైతన్య - సమంత విడిపోయి రెండేండ్లు గడించింది. వీరిద్దరూ ఎందుకు విడిపోయారనేది ఎవరూ చెప్పలేదు. తాజాగా  నాగచైతన్య డివోర్స్ పై స్పందించారు. సమంతపైనా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 
 

రెండేళ్ల కిందనే అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) - సమంత (Samantha) విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాది కిందనే చట్ట ప్రకారంగానూ విడాకులు పొందారు. ప్రస్తుతం ఎవరి  లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. కానీ వీరి డివోర్స్ కు కారణం ఏంటనేది ఇప్పటి వరకు తెలియలేదు. 
 

‘కస్టడి’ చిత్ర ప్రమోషన్స్ లో నాగచైతన్య ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వీలైనన్నీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా చైతన్యకు సమంతతో విడాకులపై ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఏట్టకేళకు తొలిసారిగా డివోర్స్ పై స్పందించారు. 
 


చైతన్య మాట్లాడుతూ..  మేమిద్దరం విడిపోయి రెండేళ్లు గడించింది. ఏడాది కిందనే మాకు చట్టపరంగా విడాకులు కూడా అందాయి. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీ అయ్యాం. మేం విడిపోయినా  ఆమెతో కలిసి ఉన్న రోజులను చాలా గౌరవిస్తున్నాను. నిజం చెప్పాలంటే సమంత  చాలా మంచిది. అన్నీ ఆనందాలకు ఆమె అర్హురాలు. 
 

అసలు మేం విడిపోవడానికి కారణం పుకార్లే. సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు, మీడియాలో వచ్చిన కొన్ని వార్తల కారణంగానే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మొదట్లో ఆ రూమర్లను పట్టించుకోలేదు. కానీ తర్వాత పెద్దా మారాయి. అవి కాస్తా డివోర్స్ దాకా వెళ్లాయి. విడిపోవాల్సి వచ్చింది.’ అంటూ తొలిసారి స్పందించారు. 
 

రీసెంట్ గా వచ్చిన రూమర్లపైనా స్పందించారు. ‘జనాలు ఇప్పటికీ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. సంబంధంలేని మూడో వ్యక్తిని తీసుకొస్తున్నారు. ఆమెను అగౌరవపరుస్తున్నారు. జీవితంలో ప్రతీది ఒక గుణపాఠమే. ప్రతి దశలో ఏదొకటి నేర్చుకుంటాం. ప్రస్తుతం ఏం జరిగినా మంచికే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నాను’ అని చెప్పుకొచ్చారు. చైతూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

నాగచైతన్య  ‘కస్టడీ’ Custody మే12న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ గా కృతీ శెట్టి అలరించనుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపుదిద్దుకుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.

Latest Videos

click me!