‘నేను కోరుకుందే దక్కింది’.. తన బర్త్ డే సెలబ్రేషన్స్ పై సమంత ఆసక్తికరమైన పోస్ట్..

First Published | May 5, 2023, 7:08 PM IST

స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా 36వ యేట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా సామ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను పంచుకుంది.  ఈ  సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
 

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన కేరీర్ పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. ఈక్రమంలో రీసెంట్ గా తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫొటోలను పంచుకుంది.
 

రీసెంట్ గా సామ్ 36వ యేట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గతనెల 28న సమంత పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. టాలీవుడ్, బాలీవుడ్, సౌత్ స్టార్స్ అంతా తమ బెస్ట్ విషెస్ తెలియజేశారు. అయితే, తాజాగా తన బర్త్ డే వేడుకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకుంది. ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. 
 


సమంతా రూత్ ప్రభు పుట్టినరోజు చాాలా సింపుల్ గా జరిగిందని చెప్పారు. ఆమె స్నేహితులు, సిటాడెల్ యూనిట్ ఆమె బర్త్ డేను సెలబ్రేట్ చేశారు. ఆ ఫొటోలను, వీడియోలను తాజాగా పంచుకుంది. పోస్టు పెడుతూ సామ్ ఇంట్రెస్టింగ్ గా క్యాప్షన్ ఇచ్చింది. ‘పుట్టిన రోజున సింపుల్ రూల్స్.. సర్ ప్రైజ్‌లు కాదు, కేక్‌లు కాదు.. బెలూన్‌లు కూడా కాదు.. నేను కోరుకున్నది నాకు స్పష్టంగా లభించింది.’ అని పేర్కొంది.
 

తన స్నేహితులు సెలబ్రేట్ చేయడంతో పాటు.. సిటాడెల్ చిత్ర యూనిట్ కూడా సమంత  బర్త్ డే ను సెలబ్రేట్ చేశారు. ఇలా అన్ని ఫొటోలను, వీడియోలను పంచుకుంది. బర్త్ డే రోజున సమంత మినీ డ్రెస్ లో బ్యూటీపుల్ లుక్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం సామ్ పోస్ట్ వైరల్ గా మారింది.

సమంత పంచుకున్న పోస్ట్ పై యంగ్ హీరోయిన్  నటి మాళవిక మోహనన్ స్పందించింది. కామెంట్ సెక్షన్ లో హార్ట్ ఎమోజీలను వదిలింది. ‘హ్యాపీయెస్ట్ బర్త్ డే సమంతా... రోర్’ అంటూ ఫర్జీ స్టార్ భువన్ అరోరా కామెంట్ చేశారు. ఫ్యాన్స్, నెటిజన్లు లైక్స్ కామెంట్లు పెడుతున్నారు.  
 

‘శాకుంతలం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్.. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్’ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తూ బిజీగా ఉంది. సెప్టెంబర్ 1న చిత్రం ఐదు భాషల్లో విడుదల కానుంది. 
 

Latest Videos

click me!