తాత ఏఎన్నార్‌ లుక్ లో అదరగొడుతున్న నాగచైతన్య.. ఆ పాత్ర కోసం చైతూ ఎంత కష్టపడ్డాడో తెలుసా..?

Published : Jul 30, 2022, 10:05 AM IST

నాగచైతన్య ఊహించిన విధంగా మారిపోయారు. పూర్తి ట్రాన్స్ఫమేషన్‌ తీసుకున్నారు. `లాల్‌ సింగ్‌ చద్దా` కోసం ఆయన కష్టపడ్డ తీరు చూస్తుంటే మతిపోతుంది. ఆయన నయా లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వైరల్‌ అవుతున్నాయి.   

PREV
19
తాత ఏఎన్నార్‌ లుక్ లో అదరగొడుతున్న నాగచైతన్య.. ఆ పాత్ర కోసం చైతూ ఎంత కష్టపడ్డాడో తెలుసా..?

నాగచైతన్య (Naga Chaitanya) బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `లాల్‌ సింగ్ చడ్డా`(Lal Singh Chaddha) చిత్రంలో నటిస్తున్నారు. ఆమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రమిది. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించారు. అమీర్‌ ఖాన్‌ నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇందులో నాగచైతన్య బాలరాజు బోడి పాత్రలో నటించారు. ఆర్మీ అధికారి పాత్రలో ఆయన కనిపిస్తున్నారు. 
 

29

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన నాగచైతన్య బీటీఎస్‌ని విడుదల చేశారు. ఇందులో `లాల్‌ సింగ్‌ చడ్డా` సినిమాకి సంబంధించిన నాగచైతన్య పాత్ర ఎమోషనల్‌ జర్నీని వెల్లడించారు. సినిమాకి పనిచేసిన అనుభవాలను నాగచైతన్య, ఆయనతో పనిచేసిన అనుభవాలను చిత్ర యూనిట్‌ వెల్లడించింది. 
 

39

తాను నటించిన బాలరాజు పాత్రకి ఇన్‌స్పిరేషన్‌ గురించి వెల్లడించారు చైతూ. తన తాత ఏఎన్నార్‌(ANR) ని స్ఫూర్తిగా తీసుకున్నట్టు చెప్పారు. ఏఎన్నార్‌ నటించిన `బాలరాజు`(Balaraju) సినిమా తనకిష్టమని, ఈ చిత్రంలో పాత్రకి ఆ పేరు పెడితే బాగుంటుందనిపించింది. అమీర్‌ ఖాన్‌ టీమ్ కూడా ఒప్పుకున్నారట. అయితే సర్‌ నేమ్‌ ఏం పెట్టాలన్నప్పుడు బోడిపాలెం నుంచి బోడి అనే పదాన్ని తీసుకున్నట్టు చెప్పారు. బాలరాజు బోడి అనేది సౌండింగ్‌ బాగుందని పెట్టినట్టు చెప్పారు. 

49

ఇక లుక్‌ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. టూత్‌ క్లిప్‌ కూడా పెట్టుకుని నయా లుక్‌లోకి మారిపోయారు చైతూ. ఆ క్లిప్‌ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మరోవైపు ఆర్మీ అధికారిగా, యుద్ధంలో గాయపడినట్టుగా ఆయన మారడం కోసం చేసిన సాహసం మామూలుది కాదని అన్నారు అమీర్‌ ఖాన్‌. అంతేకాదు తెలుగు నటుడు హిందీ డైలాగ్‌లను ఈజీగా చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు దర్శకుడు. 
 

59

మరోవైపు డైలాగ్‌ డిక్షన్‌, అసెస్టంట్లతో ఆయన రాసుకుని ఆన్‌లొకేషన్‌లోనే ప్రాక్టీస్‌ చేసిన విధానం చైతూ కమిట్‌మెంట్‌కి, హార్డ్ వర్క్ కి నిదర్శమని, ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పారు. లవ్లీ టు వర్క్ విత్‌ నాగచైతన్య అని, మంచి యాక్టర్‌ అని తెలిపారు. 

69

 చైతూ ఎలా చేస్తున్నారనేదానిపై అటు నాగార్జున కూడా అమీర్‌ ఖాన్‌కి ఫోన్‌ చేసి మాట్లాడారట. మరోవైపు ఆయన తల్లి లక్ష్మి కూడా ఫోన్‌ చేసిందని చెప్పారు అమీర్‌ ఖాన్‌. చైతూ పట్ల వారు చూపించిన ప్రేమ, కేర్‌ ఆశ్చర్యానికి గురి చేసిందని, మంచి మంచి పేరెంట్స్ అని వెల్లడించారు. 

79

`లాల్‌ సింగ్‌ చడ్డా` చిత్ర షూటింగ్‌ పూర్తయ్యాక ఆ సెట్‌ని వీడాలంటే చాలా బాధగా అనిపించిందని, ఎమోషనల్‌ జర్నీగా అనిపించిందన్నారు చైతూ. ఆ సినిమా చేస్తున్నంత సేపు బయటి ప్రపంచాన్ని మర్చిపోయానని, పూర్తిగా ఆసినిమాలోనే ఉండిపోయానని, దాన్నుంచి బయటకు రావాలంటే అస్సలు రాలేకపోయానని, చాలా బాధగా అనిపించిందని చెప్పారు చైతూ. 

89

మరోవైపు తాతగారు ఏఎన్నార్‌ లుక్‌లోనూ కనిపించారు. బాలరాజు పాత్రలో తాత ఎలా ఉండేవారు అలా మారిపోయారు. చూడ్డానికి సాధువుగా కనిపించడం విశేషం. మరోవైపు బాలరాజు సినిమా టైమ్‌లో ఏఎన్నారు లుక్‌ ఎలా ఉంటుందో సేమ్‌ అదే విధంగా ఈ చిత్రంలోనూ కనిపించారు నాగచైతన్య. మీసాల నుంచి హెయిర్‌ స్టయిల్‌ వరకు తాతనే ఫాలో అయ్యారు. 
 

99

ప్రస్తుతం ఆయా లుక్స్ ని సైతం ఈ స్పెషల్‌ వీడియోలో చూపించారు. ఓ వైపు ఆర్మీ అధికారికగా, మరోవైపు హిందూ సాంప్రదాయాలు పాటించే వ్యక్తి, మ్యారేజ్‌ టైమ్‌లో ఆయన లుక్‌, ఇలా ప్రతిదీ క్షుణ్ణంగా చూపించారు. డిఫరెంట్‌ లుక్స్ లో అదరగొడుతున్నారు చైతూ. ఆ పాత్ర కోసం, డిఫరెంట్‌ లుక్స్ కోసం ఆయన పడ్డ కష్టం కనిపిస్తుంది. అక్కినేని ఫ్యాన్స్ కిది బెస్ట్ ట్రీట్ అవుతుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories