ఆ హీరో సినిమా హిట్ అయితే ఏపీ వరకు రీ సౌండ్ వినిపిస్తుంది.. నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు 

First Published | Aug 15, 2024, 4:08 PM IST

నాగ చైతన్య రీసెంట్ గా చెన్నైలో ఒక అవార్డు ఫంక్షన్ కి హాజరయ్యాడు. ఈ అవార్డు వేడుకలో చైతు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న సెలెబ్రిటీ. నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితంతో తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. సమంతతో విడిపోయాక చైతు తన చిత్రాలతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం చైతు చందు ముండేటి దర్శకత్వంలో తండేల్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Nagarjuna Akkineni

ఇటీవల నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాలతో జరిగింది. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కావాలని డిసైడ్ అయ్యారు. నాగ చైతన్య రీసెంట్ గా చెన్నైలో ఒక అవార్డు ఫంక్షన్ కి హాజరయ్యాడు. 


Naga Chaitanya

ఈ అవార్డు వేడుకలో చైతు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య వేదికపైకి వెళ్ళగానే స్క్రీన్ పై దళపతి విజయ్ నటిస్తున్న గోట్ చిత్ర పోస్టర్ ప్రదర్శించారు. దీనిపై స్పదించాలని యాంకర్ అడిగింది. గోట్ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 

Thalapathy vijay

వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఆల్రెడీ కస్టడీ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే చైతూకి వెంకట్ ప్రభుపై అభిమానం ఉంది. కస్టడీ చిత్రంలో నటిస్తున్నప్పుడు వెంకట్ ప్రభు నాకు గోట్ కథ చెప్పారు. విజయ్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం అద్భుతంగా నచ్చుతుంది. అది గ్యారెంటీ. 

దళపతి విజయ్ సినిమా హిట్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడు నుంచి ఏపీ వరకు రీ సౌండ్ వినిపిస్తుంది అంటూ నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Latest Videos

click me!