శ్రీదేవి నుంచి కృతీ శెట్టి వరకూ.. 16 ఏళ్లకే హీరోయిన్లు గా మారిన తారలు ఎవరు..?

మనకు తెలిసిన చాలామంది హీరోయిన్లు చాలా చిన్నవయస్సులోనే ఇండస్ట్రీకివచ్చారు. కొంత మంది బాలనటులు గా కెరీర్ స్టార్ట్ చేస్తే.. మరికొందరు 16 ఏళ్లకే హీరోయిన్లు గా కెరీర్ ను స్టార్ట్ చేశారు.. ఇంతకీ ఎవరు వారు..? డీటేయిల్స్ లోకి వెళ్తే..? 

హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ టైమ్ ఉంటుంది. అందుకే చాలా త్వరగా ఎంట్రీ ఇచ్చి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటుంటారు. 15 నుంచి16 ఏళ్ళ మధ్యలోనే కెరీర్ ను స్టార్ట్ చేసిన వారు చాలామంది ఉన్నారు. అందులో కొంత మంది చూసుకుంటే..రీసెంట్ హీరోయిన్లలో కృతీ శెట్టి చాలా తక్కువ టైమ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది.   కర్ణాటక మంగుళూరులో 2003 సెప్టెంబరు 21న పుట్టింది​ కృతిశెట్టి. చిన్నప్పుడే మోడల్​గా కెరీర్​ ప్రారంభించి పలు యాడ్స్ లో నటించింది ఆతరువాత  17 ఏళ్లకే ఉప్పెన' సినిమాతో హీరోయిన్​​ ఎంట్రీ ఇచ్చింది ఈబ్యూటీ.. వరుసగా సినిమాలతో ఊపు ఊపేసిన ఆమె.. ఇప్పుడు అసలు చేతిలో సినిమాలు లేక కనిపించకుండా పోయింది. 
 

Hansika Motwani

50 సినిమాలకు పైగా నటించిన హీరోయిన్ హన్సిక మోత్వానీ.. మహారాష్ట్రలోని ముంబయిలో 1991 ఆగస్టు 9న జన్మించింది. బుల్లితెర నుంచి కెరీర్​ ప్రారంభించి, బాలీవుడ్​లో హృతిక్ తో బాలనటిగా కోయి మిల్ గయాలాంటి పలు​ చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. టాలీవుడ్​లో  అల్లు అర్జున్​ - పూరీ జగన్నాథ్​ కాంబినేషన్​లో వచ్చిన 'దేశముదురు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. అయితే అప్పటికి ఆమెవయస్సు కేవలం 16 ఏళ్లే.  


Niveda Thomas

సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ.. పద్దతిగల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నివేధా థామస్. కేరళలోని కన్నూర్​లో 1995 నవంబరు 2న నివేదా థామస్​ పుట్టింది. టీవీ సీరియల్స్​లో బాలనటిగా కెరీర్​ను ప్రారంభించిన ఈమె.. ఆ తర్వాత మలయాళంలో తెరకెక్కిన 'వేరుతు ఓరు భార్య' సినిమాకుగాను బాలనటిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకుంది. ఇదే ఆమె నటించిన తొలిచిత్రం కావడం విశేషం.

పదేళ్ల వయసు నుంచే బాలీవుడ్​లో బాలనటిగా చేస్తూ.. 17 ఏళ్ల వయసులోనే 'కొత్త బంగారు లోకం'తో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది శ్వేతబసు ప్రసాద్​. ఆ తర్వాత తెలుగు, తమిళ, బెంగాలీ సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకుని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రం 'ఇండియా లాక్​డౌన్​'లో నటిస్తుంది.

తెలుగు,తమిళ, హిందీ భాషల్లలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రీదేవి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మారి స్టార్ డమ్ తెచ్చుకున్నారు శ్రీదేవి . దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో 'మూను ముడిచు' సినిమాలో హీరోయిన్ గా నటించేనాటికి వయసు 13 ఏళ్లు. ఆతరువాత 16 ఏళ్ల వయస్సు సినిమాతో తెలుగులో సంచలనంగా మారింది శ్రీదేవి. అప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్ళు కావడం విశేషం. 
 

నటి శోభ కూడా 14 ఏళ్ల వయస్సులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  దర్శకుడు బాలచంద్రన్ 'ఏప్రిల్ 18'లో ఆమె నటించింది.అప్పుడు ఆమె వయస్సు కేవలం పదమూడున్నర సంవత్సరాలు. శోభన ఆతరువాత తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగారు. 
 

Bhanu Priya

అలాగే సీనియర్ తార బానుప్రియ కూడా 13 ఏళ్లకే హీరోయిన్ అయ్యింది.  1983లో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఈ సినిమాకి ముందు బానుప్రియ 'తురల్ నిన్ను పోచు' సినిమాలో నటించే అవకాశం రాకపోగా, ఆ సినిమా విడుదలయ్యాక ఆ హీరోయిన్ అవకాశం వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిసింది. 90వ దశకంలో ఆమె స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. 
 

Latest Videos

click me!