అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో చైతు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ప్రస్తుతం నాగ చైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా గత ఏడాది నాగ చైతన్య, సమంత విభేదాల కారణంగా వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.