Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకాదరణ భారీ స్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
స్వప్న (Swapna) జ్వాల పై అనేక మాటలతో విరుచుకుపడుతూ.. మీరందరూ ఇచ్చిన చనువు వల్లే ఇది ఇలా రెచ్చిపోతుంది అని నిరూపమ్ (Nirupam) ను అంటుంది. ఇక జ్వాల ఆటో ఆటో అంటున్నారు. ఆటో అంటే అంత చులకనగా కనపడుతుందా..
27
అంతేకాకుండా అక్కడ కొంతమంది ఇక్కడ కొంత మంది ఉంటే దీని కుటుంబం అనరు అని స్వప్న ను అంటుంది. దాంతో స్వప్న (Swapna) నన్ను అంత మాట అంటావా అని కోప్పడుతుంది. ఇక జ్వాల (Jwala) ఏం చేస్తారు అని రెచ్చగొడుతుంది. దాంతో స్వప్న వెంటనే వెళ్లి జ్వాల ఆటోను తగల బేడుతుంది.
37
ఇక స్వప్న వెళ్ళిపోతున్న క్రమంలో ఇది నీకే కాదు నా జోలికి ఎవరొచ్చినా సరే ఇలాగే జరుగుతుంది అని వార్ణింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక మండుతున్న ఆటోను చూసిన జ్వాల (Jwala) ఎంతో బాధను వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఆనంద్ వాళ్ల తల్లిదండ్రుల ఫోటోను చూస్తూ ఏడుస్తూ ఉంటాడు.
47
ఇక జరిగిన విషయం తెలిసిన సౌందర్య (Soundarya) స్వప్న ఇంటికి వెళ్లి అసలు నువ్వు మనిషివేనా అంటూ విరుచుకు పడుతుంది. అసలు ఇలా తయారయ్యావు ఏంటి అని అడుగుతుంది. స్వప్న (Swapna) విషయంలో అసహనం వ్యక్తం చేసిన సౌందర్య.. నువ్వు ఒకరి పొట్ట మీద కొట్టావు ఈ పాపం ఊరికే పోదు అని అంటుంది.
57
మరో వైపు నిరూపమ్ (Nirupam) తను నా వల్ల నష్టపోయింది. తనకు నేను ఏదో ఒక సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు సౌర్య.. మేడం నా బ్రతుకు తెరువు అయినా ఆటోని సింపుల్గా తలగపెట్టింది. రేపటి నుంచి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తుంది.
67
ఇక ఆటో తగల పెట్టినందుకు ఇంద్రుడు (Indrudu) ఒక రేంజ్ లో కోప్పడతాడు. అంతే కాకుండా పద తన సంగతి ఏంటో తేల్చేద్దాం అని అంటాడు. మరోవైపు ఆనంద్ (Anand Rao) రావ్, స్వప్న లు ఒకరి కి కొకరు ఎంతో ప్రేమను చూపుకుంటూ మాట్లాడుకుంటారు.
77
ఇక తరువాయి భాగం లో హిమ (Hima) నిరూపమ్ లు జ్వాల (Jwala) కోసం కొత్త ఆటో ను కొని తెచ్చి ఇస్తారు. దాంతో జ్వాల ఎంతో ఆనంద పడుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.