నాగ చైతన్య దాచుకున్న సమంత చివరి ఫోటో ఇదే..అది కూడా డిలీట్ చేసేశాడు, ఎందుకంటే

First Published | Oct 28, 2024, 10:40 AM IST

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల ఇరు కుటుంబాలు పసుపు దంచి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించారు. అతి త్వరలో చైతు, శోభిత మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రెండేళ్ల నుంచి చైతు శోభిత ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల ఇరు కుటుంబాలు పసుపు దంచి పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించారు. అతి త్వరలో చైతు, శోభిత మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. రెండేళ్ల నుంచి చైతు శోభిత ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు రూమర్స్ వస్తున్నాయి కానీ.. వీళ్ళిద్దరూ తమ రిలేషన్ ని అఫీషియల్ గా ప్రకటించింది నిశ్చితార్థం వేడుకతోనే. 

Naga Chaitanya

సమంత నుంచి విడిపోయాక చైతు.. శోభిత ప్రేమలోపడ్డాడు. నాగ చైతన్య, సమంత గతంలో ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్నారు. 2021లో వ్యక్తిగత కారణాలు, విభేదాల వల్ల చైతు, సమంత విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల సమయంలో నాగ చైతన్య, సమంత ఇద్దరూ కలసి ఉన్న ఫోటోలని వారి వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. 


అయితే నాగ చైతన్య సమంతతో నటించిన మజిలీ చిత్ర పోస్టర్స్ ని అలాగే ఉంచారు. అదే విధంగా నాగ చైతన్య సమంత కలసి ఉన్న ఒక్క ఫోటోని మాత్రం సోషల్ మీడియాలో దాచుకున్నారు. చైతు తన ఫెరారీ కారులో రేసింగ్ ట్రాక్ పై సమంతతో స్టైలిష్ గా దిగిన ఫోటో అది. ఈ పిక్ లో చైతు, సామ్ ఇద్దరూ వెనుకవైపు నుంచి కనిపిస్తారు. 

Actress Samantha

ఈ ఫోటోకి నాగ చైతన్య మిసెస్ అండ్ ది గర్ల్ ఫ్రెండ్ అనే క్యాప్షన్ అప్పట్లో పెట్టుకున్నాడు. అయితే చైతు, శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత సమంత ఫొటోలో పూర్తిగా డిలీట్ చేయాలి అని సామ్ అభిమానులు సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. 

త్వరలో, చైతు, శోభిత వివాహం జరుగనుంది. ఈ తరుణంలో నాగ చైతన్య తాను దాచుకున్న సమంత చివరి ఫోటోని కూడా డిలీట్ చేశారు. దీనితో ఈ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఏమాయ చేశావే చిత్రంతో చైతు, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. మొత్తంగా నాగ చైతన్య రెండో వివాహం చేసుకుంటూ కొత్త జీవితానికి స్వాగతం చెబుతున్నాడు. 

Latest Videos

click me!