చైతు, చందూ ముండేటి మూవీ స్టోరీ లీక్.. షాకింగ్, సాఫ్ట్ బాయ్ చేత అలాంటి పని చేయించబోతున్నారే..

Published : Jun 02, 2023, 01:44 PM IST

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఇటీవల అంత ఆశాజనకంగా లేదు. ఆ మాటకొస్తే అక్కినేని ఫ్యామిలి హీరోలెవరికీ ఇటీవల కలసి రావడం లేదు. నాగ చైతన్య చివరగా కస్టడీ అనే చిత్రంలో నటించాడు.

PREV
16
చైతు, చందూ ముండేటి మూవీ స్టోరీ లీక్.. షాకింగ్, సాఫ్ట్ బాయ్ చేత అలాంటి పని చేయించబోతున్నారే..
Naga Chaitanya

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఇటీవల అంత ఆశాజనకంగా లేదు. ఆ మాటకొస్తే అక్కినేని ఫ్యామిలి హీరోలెవరికీ ఇటీవల కలసి రావడం లేదు. అఖిల్ రీసెంట్ గా ఏజెంట్ చిత్రంతో దారుణమైన ఫ్లాప్ మూటగట్టుకున్నాడు. అటు నాగార్జున నటిస్తున్న చిత్రాలు కూడా నిరాశపరుస్తున్నాయి. 

26

నాగ చైతన్య చివరగా కస్టడీ అనే చిత్రంలో నటించాడు. ఈ మూవీ ఇటీవల విడుదలై ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో నాగ చైతన్య కెరీర్ కాస్త గందరగోళంలో పడింది. అంతకు ముందు నటించిన థ్యాంక్యూ కూడా పెద్ద డిజాస్టరే. దీనితో చైతు తన నెక్స్ట్ మూవీతో ఎలాగైనా ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని భావిస్తున్నాడు. అయితే నాగ చైతన్య తదుపరి చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఖరారైంది. 

36

దర్శకుడు కూడా ఫైనల్ అయ్యారు. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన చందూ ముండేటి చైతూతో మరో చిత్రం చేయబోతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబోలో సవ్యసాచి అనే మూవీ వచ్చింది. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

 

46

ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో బన్ని వాసు.. చైతు, చందుముండేటి కాంబోలో చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ రివీల్ చేశారు. కథ గురించి షాకింగ్ హింట్స్ ఇచ్చారు. 

56

ఈ చిత్రంలో నాగ ఛైతన్య మత్స్యకార యువకుడిగా.. జాలరిగా కనిపించబోతున్నట్లు బన్నీ వాసు తెలిపారు. చందు ముండేటి ఈ పాయింట్ వివరించగానే నాగ చైతన్య ఈ చిత్రానికి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. సముద్రంలో చేపల్ని వేటాడే బోట్ డ్రైవర్ గా చైతు కనిపించబోతున్నాడు. అంటే ఈ చిత్రంలో అడ్వెంచర్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉంటాయి. 

66

చైతు ఈ తరహా పాత్ర ఇంత వరకు నటించలేదు. జాలరి పాత్ర అంతే మాస్ లుక్ లో రఫ్ గా కనిపించాల్సి ఉంటుంది. కానీ చైతు చూడడానికి చాలా సాఫ్ట్ బాయ్ లాగా కనిపిస్తాడు. మరి చందు ముండేటి చైతూని ఆ పాత్రకి తగ్గట్లుగా ఎలా మౌల్డ్ చేస్తాడో చూడాలి. చందుముండేటి చిత్రం అంటే కథ అద్భుతంగా ఉంటుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. 

click me!

Recommended Stories