శోభిత, నాగ చైతన్య ప్రేమలో కీలక పరిణామం, సర్ప్రైజ్ ఇస్తారా.. ఫ్యామిలీ వద్దకు మ్యాటర్ ?

Published : Feb 15, 2023, 09:50 AM IST

సమంతతో విడిపోయినప్పటి నుంచి నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ చైతు తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.

PREV
16
శోభిత, నాగ చైతన్య ప్రేమలో కీలక పరిణామం, సర్ప్రైజ్ ఇస్తారా.. ఫ్యామిలీ వద్దకు మ్యాటర్ ?

సమంతతో విడిపోయినప్పటి నుంచి నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి తరచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ చైతు తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. థ్యాంక్యూ లాంటి డిజాస్టర్ తర్వాత చైతు చేస్తున్న చిత్రం ఇది. 

26
Naga Chaitanya

అయితే చైతు సినిమాల కంటే అతని పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.  ఈ మధ్యన వైజాగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ్ల, నాగ చైతన్య గురించి పెద్దఎత్తున రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ రూమర్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య హాట్ హాట్ చర్చలు కూడా జరిగాయి.

36
Naga Chaitanya

నాగ చైతన్య, శోభిత ఒక చోట జంటగా కనిపించారనే వార్తలు వచ్చాయి. ఓ ఫోటో కూడా లీక్ అయింది. అయితే అది ఎడిటెడ్ అనే వాదన కూడా ఉంది. శోభిత సోషల్ మీడియా పోస్ట్ కి నాగ చైతన్య లైక్ కొట్టడం లాంటి సంఘటనలు కూడా జరిగాయి. దీనితో చైతు, శోభిత మధ్య ప్రేమ ఉందనే వాదనకి బలం చేకూరుతూ వచ్చింది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలియదు. 

46

చైతు, శోభిత ప్రేమ నిజమా ? ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారా ? భవిష్యత్తులో ఒక్కటవుతారా ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అక్కినేని కాంపౌండ్ నుంచే సమాధానం రావాలి. అయితే తాజాగా నాగ చైతన్య, శోభిత గురించి మరో క్రేజీ రూమర్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. చైతు, శోభిత ప్రేమ విషయంలో అక్కినేని ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

56

తమ ప్రేమ విషయాన్ని శోభిత, చైతు ఇరు కుటుంబ సభ్యులకు తెలిపారట. ఎప్పటికైనా చైతూకి ఒక తోడు కావాలి. దీనితో చైతు నిర్ణయాన్ని గౌరవించి శోభితతో ప్రేమకి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. శోభితతో కలసి నటించిన అడివి శేష్ కూడా అక్కినేని ఫ్యామిలీతో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడు. ఇప్పటికైతే చైతు, శోభిత తమ రిలేషన్ ని సీక్రెట్ గానే మైంటైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

66

నాగ చైతన్య కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు. శోభిత వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ నటిగా రాణిస్తోంది. సోషల్ మీడియాలో అల్ట్రా మోడరన్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. త్వరలో చైతు, శోభిత ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories