లండన్ లో నాగచైతన్య - శోభితా ధూళిపాళ డేట్ నైట్.. ఒకే రెస్టారెంట్ లో కలిసి డిన్నర్.. వైరల్ గా మారిన పిక్..

First Published | Mar 28, 2023, 6:34 PM IST

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య - శోభితా దూళిపాళ కొద్దిరోజులగా డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరు లండన్ లో డిన్నర్ కు వెళ్లిన ఓ ఫొటో వైరల్ గా మారింది. 
 

యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya ) - సమంత విడిపోయి దాదాపు రెండేండ్లు కావస్తోంది. ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. అటు సమంత కేరీర్ లో ఫుల్ బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. ఇటు చైతూ కూడా సినిమాపై ఫోకస్ పెట్టి బిజీగా మారారు. 
 

అయితే సమంతతో విడిపోయిన కొద్ది నెలలకే అక్కినేని నాగచైతన్య మరో హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు పుట్టుకొచ్చాయి. ఆమెవరో కాదు యంగ్ బ్యూటీ శోభితా ధూళిపాళనే. వీరిద్దరూ రెగ్యూలర్ గా కలుస్తున్నారని, ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయం కూడా ఏర్పడిందంటూ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.  కానీ వీటిపై ఎప్పుడూ వారు స్పందించలేదు. 
 


ఇక మంట లేనిదే పొగ రాదన్నట్టుగా నాగచైతన్య - శోభితా  రిలేషన్స్ పూ తరుచుగా వార్తలు వస్తుూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరూ లండన్ లో డిన్నర్ డేట్ కు వెళ్లినట్టు ఓ ఫొటో ద్వారా వెల్లడైంది. వీరిద్దరూ ఒకే రెస్టారెంట్ లో ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 

అయితే, శోభితా - చైతూ లండన్ లోని జమావర్ లో డిన్నర్ డేట్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా అక్కడి చెఫ్ సురేందర్ మోహన్.. నాగచైతన్యతో ఓ ఫొటోను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో వెనకాల టేబుల్ ముందు శోభితా కూర్చొని ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది.  
 

ఆ ఫొటోను చూసిన నెటిజన్లు ఆమె మాత్రం కచ్చితంగా శోభితనే అని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో చైతన్య - శోభితా రిలేషన్ లో ఉన్నారనేందుకు ఈ ఫొటో మరింత బలాన్ని చేకూర్చింది. గతేడాది నవంబర్ లోనూ శోభితా నాగచైతన్య లండన్ వేకేషన్ కు వెళ్లినట్టు ఓ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది.  అప్పటి నుంచి డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. 
 

ఆ తర్వాత నాగ చైతన్య కొత్త ఇంట్లోనూ శోభితా ధూళిపాళ కనిపించడం మీరి డేటింగ్ రూమర్లను వాస్తవం అనేలా చేశాయి. కనీసం ఈ రూమర్లను ఖండించకపోవడంతో సీక్రెట్ గా రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చైతూ ‘కస్టడీ’ చిత్రంలో నటిస్తున్నారు. 

Latest Videos

click me!