రామ్ చరణ్ తండ్రి కాబోతుండగా, ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకుంది. ఆయనకు ఈ బర్త్ డే చాలా ప్రత్యేకం. అందుకే గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలో నటీనటులు, టాలీవుడ్ సెలబ్రిటీలు సహా పలువురు హాజరయ్యారు. రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంట్లో ఈ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. టాలీవుడ్ ప్రముఖులు విజయ్ దేవరకొండ, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి పాల్గొన్నారు. ఇంకా అక్కినేని నాగార్జున, అమల, నాగ చైతన్య, అఖిల్ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యారు.