క్యూట్‌నెస్‌ కాదు.. ఇది చాలా హాట్‌ గురూ.. `ఉప్పెన` భామ కృతి శెట్టి రెడ్‌ వేర్‌లో స్టన్నింగ్‌ లుక్స్

Published : Oct 06, 2021, 05:10 PM IST

`ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి ఆ సినిమాలో ఎంతటి క్యూట్‌ గా మెస్మరైజ్‌ చేసిందో తెలిసిందే. గ్లామర్‌కి అతీతంగా కనిపిస్తూనే కుర్రాళ్ల హృదయాల్లో స్థానం సంపాదించింది. డ్రీమ్‌ గర్ల్ గా మారిపోయింది. ఇప్పుడు మోస్ట్ క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది.   

PREV
18
క్యూట్‌నెస్‌ కాదు.. ఇది చాలా హాట్‌ గురూ.. `ఉప్పెన` భామ కృతి శెట్టి రెడ్‌ వేర్‌లో స్టన్నింగ్‌ లుక్స్

కృతి శెట్టి లేటెస్ట్ గా రెడ్‌ డ్రెస్‌లో కనువిందు చేసింది. ఆమె చూపులు క్యూట్‌గా కనిపిస్తున్నా.. కుర్రాళ్లకి హీటెక్కిస్తుంది. ఘాటు రేపుతుంది. నెట్టింట దుమారం రేపుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి పంచుకున్న లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. అభిమానుల అలరిస్తున్నాయి. 
 

28

`ఉప్పెన` చిత్రంతో సంచలనంగా మారింది కృతి శెట్టి. ఉవ్వెత్తున ఎగిసి పడే కెరటంలా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది. అది మామూలుగా దూసుకు రావడం కాదు ఓ తుఫానులా వచ్చింది. కేవలం ఒకే ఒక్క సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమని షేక్‌ చేసింది. మోస్ట్ క్రేజీయెస్ట్ హీరోయిన్‌గా నిలిచింది. టాలీవుడ్‌లో మరే హీరోయిన్‌ కూడా ఈ రేంజ్‌లో ఎంట్రీ ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. 

38

కృతి శెట్టి ఇప్పుడు కుర్రాళ్లకి మాత్రమే కాదు యంగ్‌ హీరోలకు డ్రీమ్‌ హీరోయిన్‌గా మారింది. అందరి చూపులు ఆమెపైనే పడ్డాయి. తమ సినిమాల్లో ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు. దీంతో `ఉప్పెన` సినిమా తర్వాత ఈ బ్యూటీకి వచ్చిన ఆఫర్ల సంఖ్యం పదికిపైగానే ఉంటాయి. కానీ డేట్స్ క్లాషెస్‌ కారణంగా ప్రస్తుతం ఓ అరడజను సినిమాల్లో నటిస్తుంది కృతి శెట్టి. 

48

ప్రస్తుతం ఈ `ఉప్పెన` భామ మోస్ట్ బిజీయెస్‌ హీరోయిన్‌గా మారింది. కేవలం ఆరు లక్షల రెమ్యూనేషన్‌తో ప్రారంభమైన ఈ అమ్మడి జర్నీ ఒకే ఒక సినిమాతో రెండు కోట్ల వరకు వెళ్లిందని టాక్‌. బాలీవుడ్‌ `ఉప్పెన` రీమేక్‌లో ఈ అమ్మడికి రెండు కోట్ల వరకు ఆఫర్‌ చేశారనే వార్తలు ఆ మధ్య సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 
 

58

ప్రస్తుతం కృతి శెట్టి నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి`లో ఎంపికైంది. చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొంటుంది. మరోవైపు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న `బంగార్రాజు`లో చైతూ సరసన హీరోయిన్‌గా ఎంపికైంది కృతి. అలాగే రామ్‌పోతినేనితో జోడి కట్టింది. లింగుస్వామి డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమాలో కృతినే హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. 
 

68

అంతేకాదు నితిన్‌తోనూ నటించబోతుంది. ఆయన హీరోగా నటిస్తున్న `మాచెర్ల నియోజకవర్గం` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇలా ఐదు సినిమాలతో ప్రస్తుతం తీరికలేకుండా నటిస్తుంది కృతి. దీంతోపాటు మరికొన్ని సినిమాలు వెయిటింగ్‌ లిస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా సక్సెస్‌ అనేది జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో కృతి శెట్టిని చూస్తే అర్థమవుతుంది. 

78

`ఉప్పెన`కి ముందు కృతి అంటే ఎవరికీ తెలియదు. ఆమె పలు కమర్షియల్‌ యాడ్స్ లో నటించినా, వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ బిగ్‌స్క్రీన్‌పై సందడి చేయడం, తొలి చిత్రంతోనే బ్లాక్‌ బస్టర్‌ అందుకోవడంతో కృతి రేంజ్‌ మారిపోయింది. స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌తో ఉవ్వెత్తుని ఎగిసిపడింది కృతి. 

88

అదే సమయంలో షాపింగ్‌ ఓపెనింగ్‌లకు, కమర్షియల్‌ యాడ్స్ కి సైతం కృతి శెట్టి బెస్ట్ ఛాయిస్‌ అవుతుంది. ఓ వైపు సినిమాలు, మరోవైపు ప్రకటనలతో ఆద్యంతం అలరిస్తుంది కృతి శెట్టి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories