కమెడియన్ సుధాకర్ చివరి సినిమా ఏదో తెలుసా..? ఎందుకు సినిమాలు మానేశాడంటే..?

First Published | Aug 12, 2024, 8:16 PM IST

స్టార్ కమెడియన్ సుధాకర్ గుర్తున్నాడా..? పిచ్చకొట్టుడు సుధాకర్ గా పేరు తెచ్చకున్న ఆయన సినిమాలు  మానేయడానికి కారణం ఏంటి..? ఆయన చివరి సినిమా ఏదో తెలుసా..? 

స్టార్ కమెడియన్ గా ఎంతో మందిఅభిమానాన్ని సొంతం చేసుకున్నాడు సుధాకర్. ఓ పదేళ ముందు వరకూ వరుస సినిమాలు చేస్తూ.. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు సుధాకర్. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరి పక్కన ఫ్రెండ్ గా, అసిస్టెంట్ గా.. కామెడీ పాత్రలతో అలరించాడు సుధాకర్. 
 

బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్, ఏవీఎస్ లాంటి కమెడియన్స్ కు సమానంగా సుధాకర్ స్టార్ డమ్ ను అనుభవించాడు. మెగాస్టార్ చిరంజీవి రూమ్ మెంట్ అయిన సుధాకర్.. టాలీవుడ్ హాస్యప్రపంచాన్ని ఏలాడు. ఆతరువాత చిన్నగా కనుమరుగయ్యాడు. ఒకప్పుడు మలయాళంలో స్టార్ హీరో స్థాయిని చేరుకున్న సుధాకర్.. ఇప్పుడు అసలు గుర్తు కూడా పట్టనంతగా మారిపోయాడు. 
 


వెండితెరపై వెలుగు వెలిగిన ఈ స్టార్ కమెడియన్.. ఇలా ఎందుకు అయ్యాడు..? తాజాగా తన కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈమధ్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుధాకర్.. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన చివరి సినిమా గురించి.. తాను సినిమాలు ఎందుకు మానేశాడు అనే విషయాన్ని వెల్లడించాడు సుధాకర్.. ఇంతకీ ఆయన ఏమంటున్నాడంటే..? 

తాజాగా మెగా బ్రదర్ నాగబాబు కొత్త ఛానెల్ కు తన కొడుకుతో కలిసి సుధాకర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో సుధాకర్ మాట్లాడుతూ.. వెంకటేష్ సంక్రాంతి నా లాస్ట్ సినిమా. దాని తర్వాతే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాని వల్లే సినిమాలకు దూరమయ్యాను. ప్రస్తుతం నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడు సినిమాలు చేయలేను. నా కొడుకు నా లోటుని భర్తీ చేయాలను అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. 

అయితే సుధాకర్ తనయుడు బెన్ని మాత్రం.. నాన్న ఏజ్ కి తగ్గట్టు ఏదైనా పాత్రలు వస్తే చేపించాలని అనుకుంటున్నాను అని తెలిపాడు. సుధాకర్ సంక్రాంతి సినిమాలో చివరగా నటించినా అతను నటించిన మరి కొన్ని సినిమాలు ఆ తర్వాత కూడా రిలీజ్ అయ్యాయి. అలా ఓ అద్భుతమైన కమెడియన్ బ్రేయిన్ స్ట్రోక్ కారణంగా ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చింది. 

Latest Videos

click me!