మెగా డాటర్ నిహారిక నటిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. డెడ్ పిక్సెల్స్ టైటిల్ తో నిహారిక ఓ వెబ్ సిరీస్ చేశారు. హాట్ స్టార్ లో మే 19 నుండి ఇది స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేశారు. డెడ్ పిక్సెల్స్ సిరీస్ ఓ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఆన్లైన్ గేమ్స్ యూత్ ని ఊపేస్తున్నాయి. ఈ గేమ్ పార్టనర్స్ లైఫ్ పార్టనర్స్ గా కూడా మారిపోతున్నారు. ఆ కాన్సెప్ట్ తో డెడ్ పిక్సెల్స్ తెరకెక్కింది.