రామ్‌చరణ్‌ బర్త్ డే బాష్‌లో వెంకీ, విజయ్‌, నాగ్‌, చైతూ, కాజల్‌, రాజమౌళి, శేష్‌, మనోజ్‌.. తారల సందడి.. ఫోటోలు

Published : Mar 28, 2023, 01:04 PM IST

రామ్‌ చరణ్‌ బర్త్ డే పార్టీ సోమవారం రాత్రి గ్రాండ్‌గా జరిగింది. ఇందులో టాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. వెంకటేష్‌, నాగార్జున, చైతూ, అఖిల్‌, రానా, విజయ్‌ దేవరకొండ, కాజల్‌ వంటి హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

PREV
112
రామ్‌చరణ్‌ బర్త్ డే బాష్‌లో వెంకీ, విజయ్‌, నాగ్‌, చైతూ, కాజల్‌, రాజమౌళి, శేష్‌, మనోజ్‌.. తారల సందడి.. ఫోటోలు

మెగాపవర్‌ స్టార్‌ కాస్త ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయ్యారు. ఆయన `ఆర్‌ఆర్‌ఆర్‌`తో క్రేజ్‌ ఇండియా దాటిపోయింది. ఈ క్రేజ్‌ పెరిగిన నేపథ్యంలో తాజాగా చరణ్‌ 38వ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. సోమవారం ఆయన బర్త్ డే సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా సెలబ్రిటీలకు ఆయన ప్రత్యేకంగా పార్టీ ఇచ్చారు. ఇందులో చాలా మంది తారలు పాల్గొని ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. 
 

212

రామ్‌చరణ్‌ తన బర్త్ డే బాష్‌లో బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసారు. ఆయన భార్య ఉపాసన బ్లూ డ్రెస్‌లో ఆకట్టుకున్నారు. ఈ జంట స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

312

మరోవైపు రామ్‌చరణ్‌ బర్త్ డే బాష్‌లో నాగార్జున ఫ్యామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారంతా చరణ్‌ పార్టీలో పాల్గొన్నారు. నాగ్‌తోపాటు అమల, నాగచైతన్య, అఖిల్‌ కూడా వచ్చారు. సందడి చేశారు. వీరి ఫ్యామిలీ పిక్‌ కనువిందు చేస్తుంది. 
 

412

వీరితోపాటు విక్టరీ వెంకటేష్‌ సైతం చరణ్‌ పుట్టిన రోజు పార్టీలో పాల్గొన్నారు. ఆయన కెమెరాకి పోజులిచ్చింది. తనదైన స్టయిల్‌లో లుక్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. 
 

512

ఇక రామ్‌చరణ్‌ పుట్టిన రోజు పార్టీలో కాజల్‌ దంపతులు హాజరు కావడం విశేషం. ఈ జంట మరింత ఆకర్షణగా నిలిచింది. తన భర్త గౌతమ్‌ కిచ్లుతో కలిసి ఈ పార్టీలో సందడి చేసింది కాజల్‌. పెళ్లికి ముందు, ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే స్లిమ్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఈమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

612

మరోవైపు రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ ఔట్‌ అండ్‌ ఔట్‌ వైట్‌లో మెరిశాడు. తాను సింగిల్‌గా చరణ్‌ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో తన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం. 
 

712

అలాగే టాలీవుడ్‌ హంక్‌ మ్యాన్‌ రానా బ్లాక్‌ డ్రెస్‌లో మెరిశారు. చరణ్‌ బర్త్ డే బాష్‌లో ఆయన కెమెరా ముందు పోజులిచ్చారు. ఈవెంట్‌లో తనదైన స్టయిల్‌లో హడావుడి చేశారు.

812

వీరితోపాటు.. తెలుగు చిత్ర పరిశ్రమతో ప్రపంచ పటంలో నిలిపిన దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. ఆయన సింపుల్‌గా చరణ్‌ బర్త్ డే బాష్‌లో సందడి చేశారు. 
 

912

అంతేకాదు ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆస్కార్‌ అందుకున్న సంగీత దర్శకుడు కీరవాణి కూడా వచ్చారు. ఫోటోలకు పోజులిచ్చారు. ఆస్కార్‌ వచ్చిన నేపథ్యంలో ఆయన ప్రజెన్స్ కూడా హైలైట్ గా నిలవడం విశేషం. 
 

1012

`పుష్ప`తో సంచలనాలు క్రియేట్‌ చేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కూడా రామ్‌చరణ్‌ బర్త్ డే పార్టీలో సందడి చేశారు. చరణ్‌తో ఆయన `రంగస్థలం` చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 
 

1112

అలాగే `కేజీఎఫ్‌` చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ సైతం చరణ్‌ బర్త్ డే బాష్‌లో పాల్గొని ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో `సలార్‌`ని తెరకెక్కిస్తున్నారు. 
 

1212

 వీరితోపాటు యంగ్‌ హీరోలు అడవి శేష్‌, నిఖిల్‌, మంచు మనోజ్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, శ్రీకాంత్‌, అల్లు అరవింధ్‌, సునీల్‌ నారంగ్‌, నాగబాబు, దిల్‌రాజు, అశ్వినీదత్‌, మైత్రీ మూవీ మేకర్స్, అభిషేక్‌ అగర్వాల్‌, హరీష్‌ శంకర్‌, సిద్దు జొన్నలగడ్డ, మంచు లక్ష్మి వంటి వారు పాల్గొని సందడి చేశారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories